Homeజిల్లాలునిజామాబాద్​Sriram Sagar | శ్రీరామ్​సాగర్​కు పెరిగిన వరద.. గేట్లు ఎత్తిన అధికారులు

Sriram Sagar | శ్రీరామ్​సాగర్​కు పెరిగిన వరద.. గేట్లు ఎత్తిన అధికారులు

Sriram Sagar | శ్రీరామ్​ సాగర్​ ప్రాజెక్ట్​లోకి ఎగువ నుంచి వరద పెరిగింది. దీంతో అధికారులు 8 వరద గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదలను ప్రారంభించారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Sriram Sagar | రెండు రోజులుగా శ్రీరామ్​సాగర్​ ప్రాజెక్ట్​ (SRSP)కు వరద తగ్గుముఖం పట్టింది. దీంతో అధికారులు వరద గేట్లను మూసివేశారు. అయితే ఆదివారం రాత్రి మళ్లీ ఇన్​ఫ్లో పెరగడంతో గేట్లను ఎత్తి గోదావరిలోకి నీటి విడుదలను ప్రారంభించారు.

ప్రస్తుతం జలాశయంలోకి 34,782 క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తోంది. అధికారులు 8 వరద గేట్లను ఎత్తి 24,992 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. ఎస్కేప్​ గేట్ల ద్వారా మూడు వేల క్యూసెక్కులు, కాకతీయ కాలువకు 5 వేలు, సరస్వతి కాలువకు 650, లక్ష్మి కాలువకు 200 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్​ పూర్తిస్థాయి నీటిమట్టంతో నిండుకుండలా ఉంది. ఎగువ నుంచి వరద పెరిగితే మరిన్ని గేట్లు ఎత్తుతామని అధికారులు తెలిపారు. దిగువన గోదావరి పరీవాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.