Manjeera River | మంజీరకు వరద ఉధృతి.. ఏడుపాయలలో ఆలయం మూసివేత

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Manjeera River | మంజీర నది ఉధృతంగా పారుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో సింగూరు (Singuru)​కు భారీగా ఇన్​ఫ్లో వస్తోంది. ప్రాజెక్ట్​ ఒక గేటు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో మెదక్​ (Medak) జిల్లాలోని ప్రముఖ క్షేత్రం ఏడుపాయలలో గల వనదుర్గ ఆనకట్ట (Vanadurga Project)పై నుంచి నీరు ప్రవహిస్తోంది. మెదక్​ జిల్లా కౌడిపల్లి, పాపన్నపేట, చిలిప్​చెడ్ మండలాల్లో గురువారం భారీ వర్షం కురిసింది. దీంతో మంజీర నదిలోకి వదర […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Manjeera River | మంజీర నది ఉధృతంగా పారుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో సింగూరు (Singuru)​కు భారీగా ఇన్​ఫ్లో వస్తోంది. ప్రాజెక్ట్​ ఒక గేటు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో మెదక్​ (Medak) జిల్లాలోని ప్రముఖ క్షేత్రం ఏడుపాయలలో గల వనదుర్గ ఆనకట్ట (Vanadurga Project)పై నుంచి నీరు ప్రవహిస్తోంది. మెదక్​ జిల్లా కౌడిపల్లి, పాపన్నపేట, చిలిప్​చెడ్ మండలాల్లో గురువారం భారీ వర్షం కురిసింది. దీంతో మంజీర నదిలోకి వదర పోటెత్తింది. ఏడుపాయలలో మంజీర ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో అధికారులు దుర్గామాత ఆలయాన్ని (Edupayala Temple) మూసి వేశారు. రాజగోపురంలో ఉత్సవ విగ్రహానికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఆలయానికి వచ్చే భక్తులు నీటిలోకి వెళ్లొద్దని సూచించారు.

Manjeera River | పెరుగుతున్న ఇన్​ఫ్లో

సింగూర్​, వనదుర్గా ప్రాజెక్ట్​ల నుంచి వస్తున్న నీటితో నిజాంసాగర్ (Nizam Sagar)​ ప్రాజెక్ట్​కు ఇన్​ఫ్లో పెరిగింది. ప్రస్తుతం జలాశయంలోకి తొమ్మిది వేల క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తోంది. మరోవైపు నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్ట్​ (Pocharam Project) నిండుకుండలా మారింది. మరి కొద్ది గంటల్లో డ్యాం అలుగు పారనుంది. దీంతో సాగర్​కు ఇన్​ఫ్లో మరింత పెరిగే అవకాశం ఉంది.

Manjeera River | జంట జలాశయాలకు వరద ఉధృతి

హైదరాబాద్‌ (Hyderabad) నగరంలోని జంట జలాశయాలైన హిమాయత్‌సాగర్ (Himayat Sagar), ఉస్మాన్‌సాగర్ (గండిపేట) నిండుకుండలా మారాయి. ఇప్పటికే అధికారులు హిమాయత్‌సాగర్ ఆరు గేట్లు ఎత్తి మూసీ నదిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో మూసీ నది (Musi River) ఉధృతంగా పారుతోంది. బాపుఘాట్, జియాగూడ, పురానాపూల్, నయాపూల్‌, చాదర్‌ఘాట్, ముసారాంబాగ్ దగ్గర మూసీ ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. నది పరీవాహక ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Manjeera River | కాళేశ్వరం దగ్గర..

జయశంకర్​ భూపాలపల్లి కాళేశ్వరం (Kaleshwaram) దగ్గర గోదావరి నదికి భారీగా వరద వస్తోంది. మేడిగడ్డ బ్యారేజీకి 2.89 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా.. 85 గేట్లు ఎత్తి అధికారులు వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు వదులుతున్నారు. వనపర్తి జిల్లాలోని సరళసాగర్‌ (Sarala Sagar) జలాశయానికి సైతం వరద కొనసాగుతోంది. దీంతో నాలుగు ఆటోమెటిక్‌ సైఫాన్స్‌ తెరుచుకున్నాయి. కాగా ప్రాజెక్ట్​ నిండగానే గేట్లు ఎత్తకుండా సైఫాన్స్​ తెరుచుకొని ఆటోమేటిక్​గా నీరు దిగువకు వెళ్లడం ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకత.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...