Projects | ఎస్సారెస్పీ, నిజాంసాగర్​ ప్రాజెక్ట్​లకు పోటెత్తిన వరద.. గేట్లు ఎత్తివేత

అక్షరటుడే, ఆర్మూర్​/నిజాంసాగర్​ : Projects | రాష్ట్రంలో మంగళవారం రాత్రి నుంచి భారీ వర్షం (Heavy Rain) పడుతోంది. దీంతో ప్రాజెక్ట్​లకు వరద పోటెత్తింది. ఉమ్మడి జిల్లాలోని శ్రీరామ్​సాగర్​, నిజాంసాగర్​ ప్రాజెక్ట్​లకు ఎగువ నుంచి ఇన్​ఫ్లో వస్తుండటంతో అధికారులు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. స్థానికంగా కురిస్తున్న వర్షాలతో శ్రీరామ్​సాగర్ (Sriram Sagar)​లోకి ప్రస్తుతం 40 వేల క్యూసెక్కుల వరద వస్తోంది. వరద తగ్గుముఖం పట్టడంతో సోమవారం మధ్యాహ్నం అధికారులు జలాశయం వరద గేట్లు […]

అక్షరటుడే, ఆర్మూర్​/నిజాంసాగర్​ : Projects | రాష్ట్రంలో మంగళవారం రాత్రి నుంచి భారీ వర్షం (Heavy Rain) పడుతోంది. దీంతో ప్రాజెక్ట్​లకు వరద పోటెత్తింది. ఉమ్మడి జిల్లాలోని శ్రీరామ్​సాగర్​, నిజాంసాగర్​ ప్రాజెక్ట్​లకు ఎగువ నుంచి ఇన్​ఫ్లో వస్తుండటంతో అధికారులు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

స్థానికంగా కురిస్తున్న వర్షాలతో శ్రీరామ్​సాగర్ (Sriram Sagar)​లోకి ప్రస్తుతం 40 వేల క్యూసెక్కుల వరద వస్తోంది. వరద తగ్గుముఖం పట్టడంతో సోమవారం మధ్యాహ్నం అధికారులు జలాశయం వరద గేట్లు మూసివేశారు. మంగళవారం రాత్రి నుంచి ఇన్​ఫ్లో పెరుగుతుండటంతో బుధవారం ఉదయం గేట్లను ఎత్తి దిగువకు నీటి విడుదలను ప్రారంభించారు.

Projects | 8 గేట్లు ఎత్తివేత

శ్రీరామ్​సాగర్​ 8 వరద గేట్లను ఎత్తి అధికారులు గోదావరి (Godavari)లోకి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్​ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 80.053 టీఎంసీల నీరు ఉంది. 8 వరద గేట్ల ద్వారా 25 వేల క్యూసెక్కులను గోదావరిలోకి వదులుతున్నారు. వరద కాలువకు 20 వేల క్యూసెక్కులు, కాకతీయ కాలువకు 3,500, ఎస్కేప్​ గేట్ల ద్వారా 2 వేలు, సరస్వతి కాలువకు 800, లక్ష్మి కాలువకు 200 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. అలీసాగర్​ ఎత్తిపోతల పథకానికి 360 క్యూసెక్కులు, గుత్ప ఎత్తిపోతలకు 270, మిషన్​ భగీరథకు 231 క్యూసెక్కులు వదులుతున్నారు.

Projects | నిజాంసాగర్​ 11 గేట్లు..

Projects
నిజాంసాగర్​ ప్రాజెక్ట్​ గేట్ల ద్వారా విడుదల అవుతున్న నీరు

మెదక్​, కామారెడ్డి జిల్లాల్లో మంగళవారం రాత్రి నుంచి కుండపోత వాన పడుతోంది. అతి భారీ వర్షాలతో మంజీర (Manjira) నదికి వరద పోటెత్తింది. దీంతో నిజాంసాగర్ (Nizam Sagar)​ జలాశయంలోకి భారీగా ఇన్​ఫ్లో వస్తోంది. ప్రాజెక్ట్​లోకి ప్రస్తుతం 82,306 క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తుండగా.. అధికారులు 11 గేట్ల ద్వారా 1,06,161 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. నిజాంసాగర్​ ప్రధాన కాలువకు 2,100 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రాజెక్ట్​ పూర్తి స్థాయి సామర్థ్యం 17.802 టీఎంసీలు కాగా ప్రస్తుతం 17.788 టీఎంసీల నీరు ఉంది. ఎగువ నుంచి వరద మరింత పెరిగే అవకాశం ఉంది.

Projects | అప్రమత్తంగా ఉండాలి

మంజీరకు వరద కొనసాగుతుండటంతో నిజాంసాగర్​ ద్వారా నీటి విడుదలను పెంచే అవకాశం ఉంది. దీంతో దిగువన నది పరీవాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నిజాంసాగర్​ నుంచి నీటి విడుదల కొనసాగుతుండటంతో శ్రీరామ్​సాగర్​కు వరద పెరగనుంది. దీంతో గోదావరిలోకి సైతం నీటి విడుదలను అధికారులు పెంచనున్నారు. ఈ క్రమంలో నదిలో చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...