- Advertisement -
HomeతెలంగాణHeavy Floods | ప్రాజెక్ట్​లకు పోటెత్తిన వరద

Heavy Floods | ప్రాజెక్ట్​లకు పోటెత్తిన వరద

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Heavy Floods | నిజామాబాద్  జిల్లాలోని శ్రీరామ్​ సాగర్ (Sriram Sagar)​ ప్రాజెక్ట్​కు ఎగువ నుంచి భారీగా వరద వస్తోంది. దీంతో అధికారులు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

జలాశయంలోకి ప్రస్తుతం 2,70,219 క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తోంది. దీంతో అధికారులు 39 వరద గేట్లను ఎత్తి దిగువకు 2,10,925 క్యూసెక్కులు వదులుతున్నారు. వరద కాలువకు రెండు వేల క్యూసెక్కులు, కాకతీయ కాలువకు 5,500, ఎస్కేప్​ గేట్ల ద్వారా 2,500, సరస్వతి కాలువకు 400, అలీసాగర్​ ఎత్తిపోతలకు 360 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. మిషన్​ భగీరథకు 231, ఆవిరి రూపంలో 600 క్యూసెక్కులు పోతుంది. ప్రాజెక్ట్​ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 64.03 టీఎంసీల నీరు ఉంది.

- Advertisement -

Heavy Floods | నిజాంసాగర్​కు..

నిజాంసాగర్ ప్రాజెక్ట్ (Nizamsagar Project)​కు ఎగువన సింగూరు (Singuru), పోచారం ప్రాజెక్ట్​ల నుంచి భారీగా వరద వస్తోంది. సింగూరు జలాశయానికి 89,305 క్యూసెక్కుల వరద వస్తుండగా.. వరద గేట్ల ద్వారా 87,221 క్యూసెక్కులు, విద్యుత్​ ఉత్పత్తి ద్వారా 1,284 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. దీంతో నిజాంసాగర్​కు సైతం వరద క్రమంగా పెరుగుతోంది.

ప్రసత్తం నిజాంసాగర్​లోకి 74,340 క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తుండగా.. వరద గేట్ల ద్వారా 87,709 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రధాన కాలువకు 1,250 క్యూసెక్కులు వదులుతున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 17.8 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 13.2 టీఎంసీల నీరు ఉంది.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News