అక్షరటుడే, మెండోరా: Sriram Sagar | ఎస్సారెస్పీకి ఎగువ నుంచి వరద కొనసాగుతూనే ఉంది. దీంతో అధికారులు అప్రమత్తంగా ఉంటున్నారు. వరదను అంచనా వేస్తూ గేట్లు ఎత్తి గోదావరిలోకి (Godavari) నీటిని విడుదల చేస్తున్నారు.
ఈ మేరకు బుధవారం ఉదయం 11 గంటల వరకు 8 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసిన అధికారులు.. వరద తగ్గడంతో నాలుగు గేట్ల ద్వారా మాత్రమే నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,091 అడుగులు (80.5 టీఎంసీలు) కాగా.. పూర్తిస్థాయిలో నీరు నిల్వ ఉంది.
Sriram Sagar | కాల్వల ద్వారా నీటి విడుదల
వరద నీరు భారీగా చేరుతున్ననేపథ్యంలో ప్రాజెక్టు నుండి వివిధ కాల్వల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. కాకతీయ కాలువ ద్వారా 5,000 క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 3,000 క్యూసెక్కులు, సరస్వతి కాలువ (Saraswati Canal) ద్వారా 650 క్యూసెక్కులు, లక్ష్మి కాలువ ద్వారా 200 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు వదులుతున్నారు. అదనంగా 709 క్యూసెక్కుల నీరు ఆవిరైపోతోంది. మొత్తం 22,290 క్యూసెక్కుల నీరు వరద గేట్ల ద్వారా గోదావరిలోకి విడుదల చేస్తున్నారు.
Sriram Sagar | ప్రజలకు హెచ్చరిక
ప్రాజెక్టు దిగువ ప్రాంతాల్లో గోదావరి పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పశువులు, గొర్రెల కాపర్లు, చేపల వేటగాళ్లు, రైతులు, సామాన్య ప్రజలు గోదావరి నదిని (Godavari river) దాటే ప్రయత్నం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. అలాగే, ఎఫ్ఎఫ్సీ అలీసాగర్, గుత్ప ఎత్తిపోతల ప్రాజెక్టులకు నీటివిడుదల తాత్కాలికంగా నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు.