Sriramsagar | ప్రాజెక్టులకు కొనసాగుతున్న వరద ఉధృతి.. శ్రీరాంసాగర్​ ఎనిమిది గేట్ల ఎత్తివేత

అక్షరటుడే, మెండోరా: Sriramsagar | ఎస్సారెస్పీలోకి ఎగువ నుండి వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో ఉదయం 16 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసిన అధికారులు వరద తగ్గడంతో 11 గంటల ప్రాంతంలో 8 గేట్లు మాత్రమే ఎత్తి నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. Sriramsagar | ప్రస్తుతం ప్రాజెక్టులో.. ప్రస్తుతం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,091 అడుగులు (80.5 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 1091 అడుగులకు (80.051 టీఎంసీలు) చేరింది. జలాశయంలో నిల్వలు పూర్తిస్థాయికి చేరుకున్నాయని […]

అక్షరటుడే, మెండోరా: Sriramsagar | ఎస్సారెస్పీలోకి ఎగువ నుండి వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో ఉదయం 16 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసిన అధికారులు వరద తగ్గడంతో 11 గంటల ప్రాంతంలో 8 గేట్లు మాత్రమే ఎత్తి నీటిని గోదావరిలోకి వదులుతున్నారు.

Sriramsagar | ప్రస్తుతం ప్రాజెక్టులో..

ప్రస్తుతం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,091 అడుగులు (80.5 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 1091 అడుగులకు (80.051 టీఎంసీలు) చేరింది. జలాశయంలో నిల్వలు పూర్తిస్థాయికి చేరుకున్నాయని అధికారులు తెలిపారు. ఇన్​ఫ్లో 34,790 క్యూసెక్కులు వస్తున్న నేపథ్యంలో.. అంతేమొత్తంలో 34,790 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు.

Sriramsagar | కాల్వల ద్వారా నీటి విడుదల

ప్రాజెక్టులోకి వరదనీరు భారీగా చేరుతున్న నేపథ్యంలో ప్రాజెక్టు నుండి వివిధ కాల్వల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. కాకతీయ కాలువ (kakatiya kaluva) ద్వారా 5,000 క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 3,000 క్యూసెక్కులు, సరస్వతి కాలువ ద్వారా 650 క్యూసెక్కులు, లక్ష్మి కాలువ (laxmi Kaluva) ద్వారా 200 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు వదులుతున్నారు. అలాగే 709 క్యూసెక్కుల నీరు ఆవిరిగా పోతోంది.

Sriramsagar | అప్రమత్తంగా ఉండాలని సూచన..

ప్రాజెక్టు దిగువ ప్రాంతాల్లో గోదావరి పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పశువులు, గొర్రెల కాపర్లు, జాలర్లు, రైతులు, సామాన్య ప్రజలు గోదావరి నదిని దాటే ప్రయత్నం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. అలాగే ఎఫ్​ఎఫ్​సీ, అలీసాగర్, గుత్ప ఎత్తిపోతల ప్రాజెక్టులకు నీటి విడుదల తాత్కాలికంగా నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు.

Sriramsagar | నిజాంసాగర్​లో..

Nizam Sagar | నిజాంసాగర్​ ప్రాజెక్ట్​లోకి (Nizamsagar Project) ఎగువ నుంచి ఇన్​ఫ్లో కొనసాగుతోంది. జలాశయంలోకి ప్రస్తుతం 34,604 క్యూసెక్కుల వరద వస్తుండగా.. అధికారులు 2 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

నిజాంసాగర్​కు వరద వస్తుండడంతో వరద గేట్ల ద్వారా 13,562 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్ట్​ పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు (17.802 టీఎంసీలు) కాగా.. అంతే మొత్తంలో 1,405 అడుగులు (17.802 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది. కాగా ఎగువన సింగూరు నుంచి ప్రవాహం తగ్గింది. దీంతో దిగువకు నీటి విడుదలను అధికారులు తగ్గించారు. ఫలితంగా నిజాంసాగర్​కు ఇన్​ఫ్లో (Inflow) క్రమంగా తగ్గే అవకాశం ఉంది.

Nizam Sagar | పోచారం ప్రాజెక్ట్​లోకి..

నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్ట్​కు (Pocharam project) స్వల్పంగా ఇన్​ఫ్లో కొనసాగుతోంది. ప్రస్తుతం డ్యాం​లోకి 832 క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు ప్రాజెక్ట్​లోకి 27.948 టీఎంసీల నీరు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

shashi kiran Mottala
shashi kiran Mottala
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...