Homeజిల్లాలుకామారెడ్డిNizamsagar project | నిజాంసాగర్​ ప్రాజెక్టులోకి పోటెత్తుతున్న వరద..

Nizamsagar project | నిజాంసాగర్​ ప్రాజెక్టులోకి పోటెత్తుతున్న వరద..

అక్షరటుడే, ఎల్లారెడ్డి : Nizamsagar project | నిజాంసాగర్​ ప్రాజెక్ట్​కు ఎగువ నుంచి వరద పోటెత్తుతోంది. దీంతో 15 గేట్లను ఎత్తి దిగువకు వదులుతున్నారు.

ప్రాజెక్ట్​లోకి ప్రస్తుతం 1,09,470 క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తుండగా.. అధికారులు వరద గేట్ల ద్వారా 1,10,720 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రధాన కాలువకు వెయ్యి క్యూసెక్కులు వదులుతున్నారు. జలాశయంలో పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 17.802 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 17.022 టీఎంసీల నీరు ఉంది.

Nizamsagar project | పోచారంలోకి..

నాగిరెడ్డిపేట మండంలోని పోచారం ప్రాజెక్ట్​లోకి (Pocharam project) సైతం ఇన్​ఫ్లో భారీగానే వస్తోంది. వాగుల ద్వారా 3,396 క్యూసెక్కుల వరద వస్తోంది. 40 క్యూసెక్కులు ఆవిరి రూపంలో పోతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి వరద వస్తూనే ఉంది.

Must Read
Related News