Homeజిల్లాలునిజామాబాద్​Sriram Sagar | శ్రీరాంసాగర్​కు కొనసాగుతున్న వరద

Sriram Sagar | శ్రీరాంసాగర్​కు కొనసాగుతున్న వరద

అక్షరటుడే, మెండోరా : Sriram Sagar | ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయని శ్రీరాం సాగర్​ ప్రాజెక్ట్​కు (Sriram Sagar Project) ఎగువ నుంచి వరద కొనసాగుతోంది. భారీగా ఇన్​ఫ్లో వస్తుండడంతో అధికారులు 39 గేట్లు ఎత్తి గోదావరిలోకి నీటిని విడుదల చేస్తున్నారు.

ప్రాజెక్ట్​లోకి ప్రస్తుతం 3,20,000 క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తోంది. 39 వరద గేట్ల ద్వారా 2,59,397 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. కాకతీయ కాలువకు (Kakatiya Canal) 4 వేల క్యూసెక్కులు, ఎస్కేప్​ గేట్ల ద్వారా 4 వేలు, సరస్వతి కాలువకు 400, లక్ష్మి కాలువకు 150 క్యూసెక్కులు వదులుతున్నారు. మిషన్​ భగీరథకు 231 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 616 క్యూసెక్కులు పోతోంది.

Sriram Sagar | అప్రమత్తంగా ఉండాలి

ప్రాజెక్ట్​ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు (80.5 టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం 1085.9 అడుగుల  (62.67 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది. మొత్తం 2,59,397 క్యూసెక్కుల ఔట్​ఫ్లో నమోదవుతోంది. గోదావరిలోకి (Godavari) నీటి విడుదల కొనసాగుతుండడంతో నది పరీవాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్ట్​ అధికారులు సూచించారు.

Sriram Sagar | నిజాంసాగర్​కు..

అక్షరటుడే, ఎల్లారెడ్డి: నిజాంసాగర్​ ప్రాజెక్ట్​కు ఇన్​ఫ్లో కొనసాగుతోంది. జలాశయంలోకి ప్రస్తుతం 1,05,694 క్యూసెక్కుల వరద వస్తోంది. దీంతో అధికారులు 15 గేట్లు ఎత్తి 69,748 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రధాన కాలువకు 900 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 17.8 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 13.9 టీఎంసీల నీరు నిల్వ ఉంది.