Air India | విమానంలో కలకలం.. కాక్​పిట్​ డోర్​ తెరిచేందుకు యత్నించిన ప్రయాణికుడు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Air India | ఎయిర్​ ఇండియా విమానంలో తీవ్ర కలకలం రేగింది. విమానంలోని కాక్​పిట్​ డోర్​ను తెరవడానికి ఒక ప్రయాణికుడు యత్నించాడు. గతంలో పలుమార్లు విమానాలు హైజాక్​ కావడంతో ఎయిర్​లైన్​ సంస్థలు(Airlines) విమానాల్లో కాక్​పిట్​ డోర్లను ఏర్పాటు చేశాయి. కాక్​పిట్​లోనికి వెళ్లడానికి ప్రయాణికులకు అనుమతి లేదు. అయితే సోమవారం ఎయిరిండియా విమానంలో ఓ ప్రయాణికుడు ఆ డోర్​ తీయడానికి యత్నించాడు. బెంగళూరు నుంచి వారణాసి వెళ్తున్న విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Air India | ఎయిర్​ ఇండియా విమానంలో తీవ్ర కలకలం రేగింది. విమానంలోని కాక్​పిట్​ డోర్​ను తెరవడానికి ఒక ప్రయాణికుడు యత్నించాడు.

గతంలో పలుమార్లు విమానాలు హైజాక్​ కావడంతో ఎయిర్​లైన్​ సంస్థలు(Airlines) విమానాల్లో కాక్​పిట్​ డోర్లను ఏర్పాటు చేశాయి. కాక్​పిట్​లోనికి వెళ్లడానికి ప్రయాణికులకు అనుమతి లేదు. అయితే సోమవారం ఎయిరిండియా విమానంలో ఓ ప్రయాణికుడు ఆ డోర్​ తీయడానికి యత్నించాడు. బెంగళూరు నుంచి వారణాసి వెళ్తున్న విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. డోర్​ ఓపెన్​ చేస్తే ఫ్లైట్​ హైజాక్‌ అవుతుందన్న భయంతో పైలట్‌ తెరవలేదు.

Air India | టాయ్​లెట్​ కోసం వెళ్లి..

ఈ ఘటనపై ఎయిర్​ ఇండియా(Air India) స్పందించింది. సదరు ప్రయాణికుడు తొలిసారి విమానం ఎక్కినట్లు పేర్కొంది. దీంతో టాయ్​లెట్​ డోర్​ అనుకొని కాక్​పిట్​ డోర్​(Cockpit Door) తెరవడానికి యత్నించాడని ఒక ప్రకటనలో తెలిపింది. పటిష్టమైన భద్రత, ప్రోటోకాల్‌లు అమలులో ఉన్నాయని రాజీపడలేదని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్రతినిధి ఒకరు తెలిపారు.

Air India | ఘటనపై దర్యాప్తు

విమానం ల్యాండ్ అయిన తర్వాత ఈ విషయాన్ని సిబ్బంది సంబంధిత అధికారుల దృష్టికి తీసుకు వెళ్లారు. దీంతో అతడిని అదుపులోకి తీసుకొని పోలీసులు ప్రశ్నించారు. తాను టాయిలెట్‌ డోర్​ అనుకొని తెరిచే యత్నం చేసినట్లు ఆయన తెలిపాడు. అయితే సిబ్బంది అతడికి అది కాక్​పిట్​ డోర్​ అని చెప్పడంతో వెను తిరిగినట్లు సమాచారం. కాగా సదరు ప్రయాణికుడితో మరో ఏడుగురు విమానంలో ప్రయాణిస్తున్నట్లు సమాచారం. వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...