Local Body Elections | మొదటి విడత నామినేషన్లు పూర్తి: వివరాలు వెల్లడించిన అధికారులు

అక్షరటుడే, కామారెడ్డి : Local Body Elections | కామారెడ్డి జిల్లాలో మొదటి విడత నామినేషన్ల ఘట్టం పూర్తయింది. మొదటి విడతలో 167 సర్పంచ్ స్థానాలు, 1,520 వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉంది. మూడు రోజుల్లో 167 సర్పంచ్ స్థానాలకు 1,224 నామినేషన్లు దాఖలు కాగా 1,520 వార్డు స్థానాలకు 3,832 నామినేషన్లు (Nominations) దాఖలయ్యాయి. మొదటి విడత ఎన్నిక డిసెంబర్ 11న జరగనుంది. మండలాల వారీగా నామినేషన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. Local Body […]

అక్షరటుడే, కామారెడ్డి : Local Body Elections | కామారెడ్డి జిల్లాలో మొదటి విడత నామినేషన్ల ఘట్టం పూర్తయింది. మొదటి విడతలో 167 సర్పంచ్ స్థానాలు, 1,520 వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉంది. మూడు రోజుల్లో 167 సర్పంచ్ స్థానాలకు 1,224 నామినేషన్లు దాఖలు కాగా 1,520 వార్డు స్థానాలకు 3,832 నామినేషన్లు (Nominations) దాఖలయ్యాయి. మొదటి విడత ఎన్నిక డిసెంబర్ 11న జరగనుంది. మండలాల వారీగా నామినేషన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

Local Body Elections | వివరాలివే..

మాచారెడ్డి (Machareddy)లో 25 సర్పంచ్​ స్థానాలకు గాను 211 నామినేషన్లు, 196 వార్డులకు గాను..435 నామినేషన్లు వచ్చాయి. అలాగే భిక్కనూరులో 18 సర్పంచ్ స్థానాలకు గాను 134 నామినేషన్లు, 182 వార్డులకు గాను 544 నామినేషన్లు, తాడ్వాయిలో 18 సర్పంచ్​ స్థానాలకు 111, 168 వార్డులకు గాను 348 నామినేషన్లు వచ్చాయి. సదాశివనగర్​లో 24 సర్పంచ్​స్థానాలకు గాను.. 139 నామినేషన్లు, 214 వార్డులకు గాను 467 నామినేషన్లు దాఖలయ్యాయి.

కామారెడ్డి (Kamareddy)లో 14 సర్పంచ్​ స్థానాలకు గాను 121 నామినేషన్లు, 120వార్డులకు 356, రామారెడ్డిలో 18సర్పంచ్​ స్థానాలకు గాను 135 నామినేషన్లు, 166 సర్పంచ్​ స్థానాలకు గాను 440, పాల్వంచలో 12 సర్పంచ్​లకు గాను 97, 110వార్డులకు 312 నామినేషన్లు వచ్చాయి. దోమకొండలో 9 సర్పంచ్​లకు గాను. 74నామినేషన్లు, 96వార్డులకు గాను 286 నామినేషన్లు,రాజంపేటలో 18 సర్పంచ్​ స్థానాలకు 132నామినేషన్లు 158 వార్డులకు గాను 368, బీబీపేటలో 11 సర్పంచ్​ స్థానాలకు 70 నామినేషన్లు, 110వార్డు స్థానాలకు గాను 276 నామినేషన్లు దాఖలయ్యాయి.

Local Body Elections | రెండవ విడత నామినేషన్లు షురూ..

జిల్లాలో రెండవ విడత సర్పంచ్, వార్డు స్థానాల నామినేషన్లు మొదలయ్యాయి. ఎల్లారెడ్డి (Yellareddy), జుక్కల్ నియోజకవర్గాలలోని లింగంపేట, నాగిరెడ్డిపేట, గాంధారి, ఎల్లారెడ్డి, మహమ్మద్ నగర్, నిజాంసాగర్, పిట్లం మండలాలలో 197 గ్రామ పంచాయతీలలో సర్పంచ్, 1,654 వార్డు స్థానాలకు నామినేషన్లు స్వీకరించడానికి 57 కేంద్రాలు ఏర్పాటు చేశారు. డిసెంబర్ 2 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. డిసెంబర్ 14న ఎన్నిక జరగనుంది. 8 గ్రామాలలో 1,655 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...