అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad City | నగరంలోని ఓ పేపర్‌ప్లేట్స్ దుకాణంలో (paper plates shop) భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. నాల్గో టౌన్ పోలీస్‌స్టేషన్ (Fourth Town Police Station) పరిధిలోని భవానీ పేపర్ ప్లేట్స్ దుకాణంలో మంగళవారం షార్ట్‌సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో షాప్‌లో ఉన్న పేపర్ ప్లేట్లు, ఇతర వస్తువులు తగలబడిపోయాయి. వెంటనే స్పందించిన యజమాని, స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
Nizamabad City | స్పందించిన పోలీసులు, ఫైర్ సిబ్బంది
సంఘటనా స్థలానికి చేరుకున్న నాలుగో టౌన్ ఎస్‌హెచ్‌వో సతీశ్, ఎస్సై శ్రీకాంత్ ఫైర్‌స్టేషన్‌కు (fire station) సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది శంకర్, మధు తదితరులు ఫైరింజన్‌తో మంటలను అర్పివేశారు. ఈ అగ్నిప్రమాదంలో సుమారు రూ.9లక్షల వరకు ఆస్తినష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.