అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hyderabad | హైదరాబాద్ నగరంలోని రాజేంద్రనగర్ (Rajendranagar)లో మంగళవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బద్వేల్లోని ప్లాస్టిక్‌లో పరిశ్రమలో మంటలు చెలరేగాయి.
బద్వేల్ (Badvel)లోని కిస్మత్‌పూర్ వంతెన సమీపంలో ఉన్న ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్‌లో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. ప్లాస్టిక్ పరిశ్రమ (Plastic Industry) కావడంతో మంటలు భారీగా వ్యాపించాయి. పెద్ద ఎత్తున పొగ అలుముకుంది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అక్కడి నుంచి దూరంగా పరులుగు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అగ్నిప్రమాదానికి (Fire Accident) గల కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం.
రాజేంద్రనగర్ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ మాట్లాడుతూ.. మూసీ నాలా సమీపంలోని డంప్ యార్డ్‌లో అగ్నిప్రమాదం జరిగిందన్నారు. ఇది చెత్తకు సంబంధించిన మంటలు అన్నారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపారు.