Homeఅంతర్జాతీయంFire Accident | అమెరికాలో అగ్నిప్రమాదం.. హైదరాబాద్‌కు చెందిన యువతి మృతి

Fire Accident | అమెరికాలో అగ్నిప్రమాదం.. హైదరాబాద్‌కు చెందిన యువతి మృతి

ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లిన హైదరాబాద్‌కు చెందిన ఉడుముల సహజారెడ్డి (24) అగ్నిప్రమాదంలో మరణించింది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Fire Accident | ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా (America) వెళ్లిన హైదరాబాద్‌కు చెందిన ఉడుముల సహజారెడ్డి (24) అగ్నిప్రమాదంలో మరణించింది.

భారత కాలమానం ప్రకారం.. గురువారం రాత్రి న్యూయార్క్ రాష్ట్రం (New York State)లోని అల్బనీ నగర పరిసర ప్రాంతంలో గల ఒక అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో ఈ దుర్ఘటన సంభవించింది. పొరుగున ఉన్న భవనం నుంచి ప్రారంభమైన మంటలు వేగంగా వ్యాపించి సహజారెడ్డి నివసించే అపార్ట్‌మెంట్‌ను చుట్టుముట్టాయి. నిద్రావస్థలో ఉన్న ఆమె మంటల్లో చిక్కుకుని అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.

సహజారెడ్డి మరణ వార్త హైదరాబాద్‌ (Hyderabad)లోని జూబ్లీహిల్స్ సమీపంలో జోడిమెట్ల వెంకటాపూర్ రోడ్‌లోని శ్రీనివాస్ కాలనీలో నివసిస్తున్న ఆమె తల్లిదండ్రులకు అధికారులు అందించగానే ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. రోజూ వీడియో కాల్‌లో కనిపించి మాట్లాడే ప్రియమైన కూతురు ఇక లేదన్న వార్త తెలియడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. కాగా.. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరొకరు కూకట్​పల్లి (Kukatpally)కి చెందిన వారిగా తెలుస్తోంది.

ఈ ఘటనపై అమెరికాలోని భారత రాయబార కార్యాలయం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. సహజారెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, వారితో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది. అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పింది.

Must Read
Related News