అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hyderabad | హైదరాబాద్ నగరంలో వరుస అగ్ని ప్రమాదాలు (Fire Accidents) భయపెడుతున్నాయి. బుధవారం ఉదయం ఓ కారు షోరూమ్‌లో మంటలు చెలరేగాయి.అల్వాల్‌లోని ట్రూ వాల్యూ కార్ షోరూమ్ (True Value Car Showroom)లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో షోరూమ్‌లోని పలు కార్లు కాలిపోయాయి. షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగినట్ల సమాచారం. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Hyderabad | రాణిగంజ్‌లో..
సికింద్రాబాద్ (Secunderabad) పరిధిలోని రాణిగంజ్‌లో బుధవారం ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని నివారణ పరికరాలు నిల్వ ఉన్న గోడౌన్‌లో మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న సిబ్బంది నాలుగు ఫైరింజన్లతో ఘటన స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా శ్రమించి మంటలను ఆర్పి వేశారు. ఈ ప్రమాదంలో అగ్నిమాపక పరికరాలు కాలిపోయాయి. షార్ట్ సర్క్యూట్ (Short Circuit) కారణంగానే ప్రమాదం జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
Hyderabad | వరుస ప్రమాదాలు
ఇటీవల నగరంలో నిత్యం అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటన్నాయి. దీంతో ప్రజల భయాందోళనకు గురి అవుతున్నారు. పలు పరిశ్రమలతో సైతం దుకాణాల, భవనాల్లో సైతం మంటలు వ్యాపితున్నాయి. మంగళవారం నగరంలోని రాజేంద్రనగర్ సమీపంలోని బద్వేల్లో ఓ ప్లాస్టిక్ గోడౌన్‌లో మంటలు అంటుకున్నాయి. నిన్న రాత్రి కూకట్పల్లి గ్యాస్ సిలిండర్లు పేలడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.