Kamareddy Collector | బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లకు ఫింగర్ ప్రింట్ సెట్స్ అందజేత

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Collector | జిల్లాలోని బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లకు కొత్త మొబైల్స్ మంత్ర ఫింగర్​ ప్రింట్ సెట్​ను సోమవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (District Collector Ashish Sangwan) అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాకు మొత్తం 211 సెట్స్ వచ్చాయని తెలిపారు. వీటిని ఉపయోగించి ఫేస్ రికగ్నైజేషన్ యాప్ ద్వారా పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఎవరికైనా ఫేస్ రికగ్నైజేషన్ (face recognition) రాకపోతే మంత్ర డివైస్ ఫింగర్ ప్రింట్ […]

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Collector | జిల్లాలోని బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లకు కొత్త మొబైల్స్ మంత్ర ఫింగర్​ ప్రింట్ సెట్​ను సోమవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (District Collector Ashish Sangwan) అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాకు మొత్తం 211 సెట్స్ వచ్చాయని తెలిపారు. వీటిని ఉపయోగించి ఫేస్ రికగ్నైజేషన్ యాప్ ద్వారా పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.

ఎవరికైనా ఫేస్ రికగ్నైజేషన్ (face recognition) రాకపోతే మంత్ర డివైస్ ఫింగర్ ప్రింట్ ద్వారా పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. వీటి ద్వారా పెన్షన్ పంపిణీ నేరుగా లబ్ధిదారులకు చేరుతుందని, చాలా తక్కువ సమయంలో ఎక్కువ పెన్షన్లు పంపిణీ చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. ఎవరి పెన్షన్ వారే నేరుగా వచ్చి తీసుకొనడానికి ఒక మంచి సదవకాశమన్నారు. కార్యక్రమంలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి (Banswada Sub-Collector Kiranmayi), స్థానిక సంస్థలు అదనపు కలెక్టర్ చందర్ నాయక్, డీఆర్డీవో సురేందర్, అడిషనల్ డీఆర్డీవో విజయలక్ష్మి, డీపీఎం పెన్షన్స్ శోభా రాణి పాల్గొన్నారు.

Kamareddy Collector | మట్టి గణపతుల వినియోగం సమాజానికి మేలు

ప్లాస్టర్ ఆఫ్ పారిస్ గణపతుల కంటే మట్టి గణపతుల వినియోగం సమాజానికి మేలు చేస్తుందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. కలెక్టరేట్​లో సోమవారం పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (Pollution Control Board), బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మట్టి గణపతులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ మట్టి గణపతులను అధికారులకు, ప్రజలకు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్లాస్టర్ ఆఫ్ పారిస్​తో తయారుచేసిన వినాయకులను నీటి వనరులలో నిమజ్జనం చేసినప్పుడు నీరు కలుషితమై నివసించే ప్రాణులకు ప్రాణహాని కలవడంతోపాటు, ఆ నీటిని ఉపయోగించే మనుషులు, పశువుల ఆరోగ్యంపై కూడా దుష్ఫలితాలను కలగజేస్తుందన్నారు.

వినాయక చవితి సందర్భంగా అందరూ మట్టి గణపతులను ఉపయోగించి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చందర్ నాయక్, టీఎన్జీవోస్ అధ్యక్షుడు వెంకటరెడ్డి, డీబీ సీడబ్ల్యూవో రఫీక్, డీఆర్డీఏ పీడీ సురేందర్, తదితరులు పాల్గొన్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...