Homeజిల్లాలుకామారెడ్డిYellareddy DSP | ఎల్లారెడ్డిలో పోలీసుల స్పెషల్​ డ్రైవ్​.. రూ.లక్షకు పైగా జరిమానాల వసూలు

Yellareddy DSP | ఎల్లారెడ్డిలో పోలీసుల స్పెషల్​ డ్రైవ్​.. రూ.లక్షకు పైగా జరిమానాల వసూలు

- Advertisement -

అక్షరటుడే, ఎల్లారెడ్డి : Yellareddy DSP | ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస రావు (Yellareddy DSP Srinivasa Rao) ఆధ్వర్యంలో పట్టణంలో శుక్రవారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్‌లో భాగంగా హైదరాబాద్ రోడ్డు, బాన్సువాడ రోడ్డులో వాహన తనిఖీలు (vehicle inspections) చేపట్టారు. తనిఖీల్లో సుమారు 200 వాహనాల చలాన్లు క్లియర్​ చేయించినట్లు ఎస్సై మహేశ్​ తెలిపారు. సుమారు రూ.లక్షకు పైగా జరిమానాలు వసూలు చేశామన్నారు. అలాగే వాహనాలకు సంబంధించిన పత్రాలు లేని వాహనదారులపై కేసులు నమోదు చేశామన్నారు. కార్యక్రమంలో ఎల్లారెడ్డి సీఐ రవీందర్ నాయక్, ప్రొబేషనరీ ఎస్సై అరుణ్, జిల్లా స్పెషల్ పోలీస్ టీమ్ సభ్యులు పాల్గొన్నారు.

Must Read
Related News