అక్షరటుడే, ఇందూరు: Nizamabad City | నిబంధనలు పాటించని వడ్డీ వ్యాపారులకు జరిమానాలు విధించడం జరిగిందని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) బుధవారం తెలిపారు. మనీలాండర్స్ యాక్ట్ కేసును (Money Launderers Act case) అనుసరిస్తూ నగరానికి చెందిన ఐదుగురు వ్యాపారులకు రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకు జరిమానా విధించినట్లు తెలిపారు.
మొదటి తప్పుగా గుర్తించి సాధారణ జరిమానాలు మాత్రమే విధించామన్నారు. వడ్డీ వ్యాపారాలు చేసే వారందరూ తప్పనిసరిగా అనుమతులు కలిగి ఉండాలని తెలిపారు. నియమ నిబంధనలు తప్పక పాటించాలని, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పూర్తి వివరాలతో రికార్డులను సక్రమంగా నిర్వహించాలని స్పష్టం చేశారు. అనుమతులు లేకుండా వడ్డీ వ్యాపారం నిర్వహించే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
