Homeక్రీడలుT20 World Cup | 2026 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్‌కు క్వాలిఫై అయిన 20...

T20 World Cup | 2026 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్‌కు క్వాలిఫై అయిన 20 జట్లు.. అవేంటో తెలుసా ?

2026లో జరగబోయే ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ కోసం క్వాలిఫైయింగ్ ప్రక్రియ పూర్తయింది. మొత్తం 20 జట్లతో కూడిన తుది జాబితా ఖరారైంది. ఒమన్‌లో జరిగిన ఆసియా – ఈఏపీ క్వాలిఫైయింగ్ మ్యాచ్‌లో జపాన్‌ను ఓడించి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) చివరి 20వ జట్టుగా ప్రపంచకప్‌కు అర్హత సాధించింది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : T20 World Cup | 2026లో జరగబోయే ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ కోసం క్వాలిఫికేషన్ ప్రక్రియ పూర్తయింది. మొత్తం 20 జట్లతో ఈ మెగా టోర్నమెంట్ జరగనుంది.

ఒమన్‌లో జరిగిన ఆసియా – ఈఏపీ (ఆసియా – ఈస్ట్ ఏషియా పసిఫిక్) క్వాలిఫైయింగ్ మ్యాచ్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) జపాన్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించి చివరి 20వ జట్టుగా ప్రపంచకప్‌ (T20 World Cup)కు అర్హత సాధించింది.ఈ క్వాలిఫికేషన్ ద్వారా నేపాల్, ఒమన్, UAE జట్లు కూడా తమ స్థానాలను ఖరారు చేసుకున్నాయి. చివరి మ్యాచ్‌లో జపాన్ (Japan) 9 వికెట్లకు 116 పరుగులు చేసింది. UAE జట్టు దీన్ని కేవలం 12.1 ఓవర్లలో 2 వికెట్ల నష్టంతో ఛేదించింది.

T20 World Cup | 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోయే జట్ల పూర్తి జాబితా చూస్తే..

భారత్, శ్రీలంక (ఆతిథ్య జట్లు, నేరుగా అర్హత సాధించాయి)
సూపర్ 8 ప్రదర్శన ఆధారంగా నేరుగా అర్హత సాధించిన జట్లు: అఫ్గానిస్థాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, అమెరికా
ర్యాంకింగ్స్ ఆధారంగా అర్హత సాధించిన జట్లు: ఐర్లాండ్, న్యూజిలాండ్, పాకిస్థాన్
క్వాలిఫైయర్స్ ద్వారా అర్హత సాధించిన జట్లు: నెదర్లాండ్స్, ఇటలీ, నమీబియా, జింబాబ్వే, ఒమన్, నేపాల్, UAE, కెనడా

ఈ 20 జట్లతో ప్రపంచకప్ 2026 అట్ట‌హాసంగా జ‌ర‌గ‌నుంది. భారత్, శ్రీలంక (Srilanka) సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తుండగా, క్రికెట్ అభిమానులు తాము ఇష్టపడే జట్లు మరియు అద్భుతమైన మ్యాచ్‌ల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత ఎడిషన్ ఛాంపియన్‌గా ఉన్న భారత్ జట్టు ఈసారి కూడా టైటిల్‌ను నిలబెట్టుకునే ప్రయత్నంలో ఉంటుంది. సూర్యకుమార్ యాద‌వ్ కెప్టెన్సీలో ఆసియా క‌ప్ ద‌క్కించుకున్న టీమిండియా (Team India) ఇప్పుడు అదే ఉత్సాహంతో టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాల‌ని ఉవ్విళ్లూరుతుంది. మ‌రి యువ జ‌ట్టు ఎలాంటి సంచ‌ల‌నాలు సృష్టిస్తుందో చూడాలి.