అక్షరటుడే, కామారెడ్డి: Municipal Elections | జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు (municipal elections) సంబంధించిన పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఇప్పటికే తుది ఓటరు జాబితా, రిజర్వేషన్ల జాబిత విడుదల చేసిన మున్సిపల్ అధికారులు తాజాగా పోలింగ్ స్టేషన్ల తుది జాబితాను శుక్రవారం విడుదల చేశారు.
Municipal Elections | కామారెడ్డి మున్సిపాలిటీలో..
కామారెడ్డి మున్సిపాలిటీలో (Kamareddy Municipality) 654 మంది ఓటర్లకు ఒక పోలింగ్ స్టేషన్ను ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీలో మొత్తం 49 వార్డులుండగా 152 పోలింగ్ స్టేషన్లు, బాన్సువాడలో 19 వార్డులలో 39 పోలింగ్ స్టేషన్లు, ఎల్లారెడ్డిలో 12 వార్డులలో 24 పోలింగ్ కేంద్రాలు, బిచ్కుంద మున్సిపాలిటీలో 12 వార్డులలో 24 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. శనివారం వార్డుల వారిగా ఫైనల్ రిజర్వేషన్ విడుదల చేయనున్నారు.