Nizamabad Collector | రైతులకు అందుబాటులో ఎరువులు..: కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి

అక్షరటుడే, ఇందూరు: Nizamabad Collector | రైతుల అవసరాలకు సరిపడా ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) స్పష్టం చేశారు. మాక్లూరు మండలం అమ్రాద్ గ్రామంలోని సహకార సంఘం ఎరువుల గోడౌన్​ను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డుల్లో ఉన్న విధంగా ఎరువుల నిల్వలు ఉన్నాయా లేదా అని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులు ఎవరూ యూరియా (urea) […]

అక్షరటుడే, ఇందూరు: Nizamabad Collector | రైతుల అవసరాలకు సరిపడా ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) స్పష్టం చేశారు. మాక్లూరు మండలం అమ్రాద్ గ్రామంలోని సహకార సంఘం ఎరువుల గోడౌన్​ను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డుల్లో ఉన్న విధంగా ఎరువుల నిల్వలు ఉన్నాయా లేదా అని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులు ఎవరూ యూరియా (urea) కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పూర్తి స్థాయిలో స్టాక్ అందుబాటులో ఉందని అందరికీ అందేలా ప్రణాళిక బద్ధంగా వ్యవహరిస్తున్నామన్నారు.

Nizamabad Collector | తహశీల్దార్ కార్యాలయం తనిఖీ

మాక్లూరులోని తహశీల్దార్, ఎంపీడీవో కార్యాలయాలను (Makloor Tahsildar and MPDO offices) కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తనిఖీ చేశారు. భూభారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను కేటగిరీల వారీగా విభజిస్తూ.. ఆన్​లైన్​లో నమోదు చేస్తున్న తీరును పరిశీలించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, కొత్త రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తుల పరిశీలన, ఆమోదం తదితర అంశాల గురించి తహశీల్దార్ శేఖర్​ను అడిగి తెలుసుకున్నారు. సీజనల్ వ్యాధులు (seasonal diseases) ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం చిన్నాపూర్​లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు.

Nizamabad Collector | మొక్కల నిర్వహణపై అసంతృప్తి

అమ్రాద్ తండా కాలువ (Amrad Thanda canal) గట్టు మీద వనమోత్సవంలో భాగంగా గతేడాది నాటిన మొక్కలను కలెక్టర్ పరిశీలించారు. మొక్కల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండడాన్ని గమనించి అసంతృప్తి వ్యక్తం చేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులను వెచ్చిస్తూ అమలు చేస్తుంటే క్షేత్రస్థాయిలో నిర్వహణను పట్టించుకోకపోతే ఎలా అని సంబంధిత అధికారులను మందలించారు. నాటిన ప్రతి మొక్క బతికేలా పర్యవేక్షణ జరపాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట సంబంధిత అధికారులు ఉన్నారు.

Related articles

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...

Kalyan Jeweller: రంగుల పండుగ కోసం కల్యాణ్ జువెలర్స్ ప్రత్యేక కానుక.. ‘ది క్యూరేటెడ్ హోలీ ఎడిట్’ విడుదల

హైదరాబాద్: దేశీయ ప్రముఖ ఆభరణాల సంస్థ కల్యాణ్ జువెలర్స్, హోలీ పండుగ సంబరాలను పురస్కరించుకుని సరికొత్త ఆభరణాల శ్రేణి 'కలర్‌ఫుల్ స్టేట్‌మెంట్స్: ది క్యూరేటెడ్...