HomeతెలంగాణGovernment Hospital | సర్కారు దవాఖానాలో మహిళా జడ్జి సాధారణ కాన్పు

Government Hospital | సర్కారు దవాఖానాలో మహిళా జడ్జి సాధారణ కాన్పు

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: government hospital : ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు నమ్మకం పెంచేలా మహిళా జడ్జి సాధారణ డెలివరీ చేయించుకుని స్ఫూర్తిగా నిలిచారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sircilla District) వేములవాడ కోర్టు జూనియర్ సివిల్ జడ్జి జ్యోతిర్మయి(Vemulawada Court Junior Civil Judge Jyothirmayi) సోమవారం సర్కారు దవాఖానాలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు.

సదరు మహిళా జడ్జి 2023లోనూ వేములవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో తొలిసారి కూతురికి జన్మనిచ్చారు. తాజాగా రెండోకాన్పులో అదే హాస్పిటల్​లో కుమారుడికి జన్మనిచ్చారు. ఈ సందర్భంగా సీనియర్ కోర్టు ఏజీపీ(Senior Court AGP) బొడ్డు ప్రశాంత్ కుమార్, బార్ అసోసియేషన్(Bar Association) అధ్యక్షుడు గుండ రవి, ప్రధాన కార్యదర్శి గడ్డం సత్యనారాయణ రెడ్డి, ఇతర కార్యవర్గ సభ్యులు, న్యాయవాదులు మహిళా జడ్జికి శుభాకాంక్షలు తెలిపారు.

Must Read
Related News