Homeబిజినెస్​Stock market | గ్లోబల్‌ మార్కెట్లకు ‘ఫెడ్‌’ బూస్ట్‌.. గ్యాప్‌ అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌...

Stock market | గ్లోబల్‌ మార్కెట్లకు ‘ఫెడ్‌’ బూస్ట్‌.. గ్యాప్‌ అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: అంతర్జాతీయ మార్కెట్లు(International stock markets) పాజిటివ్‌గా ట్రేడ్‌ అవుతున్నాయి. అతి త్వరలో రేట్‌ కట్‌(Rate cut) విషయంలో ఫెడ్‌ చైర్మన్‌నుంచి సానుకూల ప్రకటన రావొచ్చన్న అంచనాలతో వాల్‌స్ట్రీట్‌(Wallstreet) గురువారం పరుగులు తీసింది. దీని ప్రభావం అన్ని మార్కెట్లపైనా కనిపించింది. గురువారం నాస్‌డాక్‌ మరో 2.74 శాతం పెరగ్గా.. ఎస్‌అండ్‌పీ(S&P) 2.03 శాతం పెరిగింది. డౌజోన్స్‌ ఫ్యూచర్స్‌ స్వల్ప నష్టంతో కొనసాగుతోంది.

Stock market | యూరోప్‌ మార్కెట్లలో ర్యాలీ..

యూరోప్‌ మార్కెట్ల(Europe markets)లో ర్యాలీ కొనసాగుతోంది. డీఏఎక్స్‌ 0.46 శాతం పెరగ్గా సీఏసీ 0.77 శాతం, ఎఫ్‌టీఎస్‌ఈ(FTSE) 0.05 శాతం లాభంతో ముగిశాయి.

Stock market | ఆసియా మార్కెట్లలోనూ జోష్‌..

ఆసియా మార్కెట్లు(Asian markets) సైతం పాజిటివ్‌గా కొనసాగుతున్నాయి. ఉదయం 8.30 గంటల ప్రాంతంలో తైవాన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ 2.27 శాతం లాభంతో ఉండగా.. నిక్కీ(Nikkei) 1.37 శాతం, హంగ్‌సెంగ్‌ 1.15 శాతం లాభంతో కదలాడుతున్నాయి. కోస్పీ 0.82 శాతం నష్టంతో ఉంది. స్ట్రేయిట్స్‌ టైమ్స్‌, షాంఘై ఫ్లాట్‌గా కొనసాగుతున్నాయి. గిఫ్ట్‌ నిఫ్టీ(Gift nifty) 0.43 శాతం లాభంతో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు గ్యాప్‌ అప్‌లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

Stock market | గమనించాల్సిన అంశాలు..

ఎఫ్‌ఐఐలు వరుసగా ఏడో ట్రేడిరగ్‌ సెషన్‌(Trading session)లోనూ నెట్‌ బయ్యర్లుగా కొనసాగారు. గురువారం నికరంగా రూ. 8,250 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశారు. ఇందులో కొన్ని బ్లాక్‌ డీల్స్‌ ఉన్నాయి. డీఐఐ(DII)లు నికరంగా రూ. 534 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించారు.

  • క్రూడ్‌ ఆయిల్‌(Crude oil) ధర బ్యారెల్‌కు 0.22 శాతం పెరిగి 62.92 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
  • డాలర్‌ ఇండెక్స్‌ 0.23 శాతం పెరిగి 99.61 వద్ద ఉంది.
  • యూఎస్‌(US) 10 ఇయర్స్‌ బాండ్‌ ఈల్డ్‌ 0.28 శాతం తగ్గి 4.31 వద్ద ఉంది.
  • రూపాయి విలువ డాలర్‌తో 25 పైసలు బలపడి 85.26 వద్ద కొనసాగుతోంది.
  • జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రదాడుల నేపథ్యంలో భారత్‌, పాక్‌ల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Must Read
Related News