అక్షరటుడే, న్యూఢిల్లీ: Feb 05 Pre Market Analysis | యూఎస్‌కు చెందిన ఏఐ సంస్థ యాంథ్రోపిక్(Anthropic) రూపొందించిన కొత్త ఏఐ టూల్స్‌తో ప్రపంచవ్యాప్తంగా ఆయా సేవలందించే టెక్ కంపెనీలు అమ్మకాల ఒత్తిడికి గురవుతున్నాయి. వరుసగా రెండో సెషన్లోనూ వాల్‌స్ట్రీట్(Wallstreet) నష్టాలతో ముగిసింది. దీని ప్రభావం ఆసియా మార్కెట్లపైనా కనిపిస్తోంది. గిఫ్ట్ నిఫ్టీ నెగెటివ్‌గా ఉండటంతో మన మార్కెట్లు నష్టాలతో ప్రారంభం కానున్నాయి.
Feb 05 Pre Market Analysis | యూఎస్ మార్కెట్లు..
గత సెషన్లో నాస్డాక్(Nasdaq) 1.48 శాతం, ఎస్అండ్పీ 0.46 శాతం పడిపోయాయి. డౌజోన్స్ ఫ్యూచర్స్ ఫ్లాట్‌గా ఉంది.
Feb 05 Pre Market Analysis | యూరోప్ మార్కెట్లు..
సీఏసీ ఒక శాతం, ఎఫ్టీఎస్ఈ 0.84 శాతం పెరగ్గా.. డీఏఎక్స్(DAX) 0.72 శాతం పడిపోయింది.
Feb 05 Pre Market Analysis | ఆసియా మార్కెట్లు..
ఉదయం 8 గంటల ప్రాంతంలో ప్రధాన ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. సౌత్ కొరియాకు చెందిన కోస్పీ(Kospi) 2.84 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 1.16 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 1.15 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.81 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 0.51 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.36 శాతం లాభంతో ఉండగా.. నష్టాలతో ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ(Gift nifty) 0.10 శాతం నష్టంతో ఉంది. దీంతో మన మార్కెట్లు గ్యాప్ డౌన్లో ప్రారంభం కానున్నాయి.
గమనించాల్సిన అంశాలు..
- ఎఫ్ఐఐలు వరుసగా రెండో సెషన్లోనూ నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. గత సెషన్లో నికరంగా రూ. 29.79 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
- డీఐఐలు సైతం వరుసగా రెండో సెషన్లో నికర కొనుగోలుదారులుగా ఉండి, రూ. 249.54 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు.
- నిఫ్టీ పుట్‌కాల్ రేషియో(PCR) 1.02 నుంచి 1.07 కు పెరిగింది.
- విక్స్ 4.98 శాతం తగ్గి 12.25 వద్ద ఉంది.
- డాలర్‌తో రూపాయి మారకం విలువ 15 పైసలు బలహీనపడి 90.42 వద్ద ఉంది.
- బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 1.96 శాతం తగ్గి 68.10 డాలర్ల వద్ద ఉంది.
- సెన్సెక్స్ డెరివేటివ్స్ వీక్లీ ఎక్స్పైరీ నేపథ్యంలో మార్కెట్లో ఒడుదుడుకులు ఉండే అవకాశాలున్నాయి.