అక్షరటుడే, హైదరాబాద్: Feb 05 Gold Prices | అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, డాలర్ బలపడటం, భారత్–అమెరికా America ట్రేడ్ డీల్ పరిణామాలు, కేంద్ర బడ్జెట్ అనంతర మార్కెట్ మార్పులు వంటి పలు అంశాల ప్రభావంతో దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు వరుసగా పెరుగుతూనే ఉన్నాయి. గత కొన్ని రోజులుగా క్రమంగా ఎగబాకుతున్న ఈ విలువైన లోహాల ధరలు బుధవారం భారీగా పెరిగి పెట్టుబడిదారులు, కొనుగోలుదారుల్లో ఆందోళన కలిగించగా, గురువారం కూడా స్వల్ప పెరుగుదల నమోదు కావడం గమనార్హం. ముఖ్యంగా బుధవారం ఒక్క రోజులోనే బంగారం ధరలు సుమారు రూ.7 వేల వరకు ఎగబాకగా, వెండి ధరలు దాదాపు రూ.20 వేల మేర పెరగడం మార్కెట్‌ను కుదిపేసింది.
Feb 05 Gold Prices | స్వల్ప పెరుగుదల..
ఈ పెరుగుదల నేపథ్యంలో దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు Silver Prices రికార్డు స్థాయిల వద్ద కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర ప్రస్తుతం రూ.1,59,450గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,46,160 వద్ద కొనసాగుతోంది.
ఇదే ధరలు విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో కూడా కనిపిస్తున్నాయి. చెన్నైలో బంగారం ధరలు మరింత ఎక్కువగా నమోదవుతూ 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,62,570కు చేరగా, 22 క్యారెట్ల ధర రూ.1,49,010గా ఉంది. బెంగళూరులో కూడా హైదరాబాద్‌తో సమానంగా 24 క్యారెట్ల బంగారం రూ.1,59,450 వద్ద, 22 క్యారెట్ల ధర రూ.1,46,160 వద్ద కొనసాగుతోంది.
దేశ రాజధాని ఢిల్లీలో Delhi 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,59,600గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం రూ.1,46,310 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు వెండి ధరలు కూడా అదే దూకుడు చూపుతున్నాయి. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.3,20,100గా ఉండగా, విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి.
చెన్నైలో కూడా కేజీ వెండి రూ.3,20,100 వద్ద స్థిరపడగా.. ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో కూడా కిలో వెండి ధర ఇదే స్థాయిలో కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి, పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తులవైపు మళ్లడం, డాలర్ బలపడటం వంటి అంశాలు బంగారం, వెండి ధరలపై స్పష్టమైన ప్రభావం చూపుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
1 comment
[…] భారత్–పాక్ మ్యాచ్‌పై… Feb 05 Gold Prices | బంగారం, వెండి ధరల… […]
Comments are closed.