అక్షరటుడే, వెబ్డెస్క్: Feb 05 Horoscope | గ్రహగతిని బట్టి చూస్తే నేడు (గురువారం, ఫిబ్రవరి 05) కొన్ని రాశుల వారికి ఆర్థికంగా, వృత్తిపరంగా అద్భుతమైన ఫలితాలు లభించనున్నాయి. ముఖ్యంగా కొత్త ఆలోచనలతో అదనపు ఆదాయాన్ని పొందే అవకాశం ఉంది.
మరికొందరు మానసిక ప్రశాంతత కోసం ధ్యానం, ఆధ్యాత్మికతపై దృష్టి పెట్టడం మేలు చేస్తుంది. అయితే, ఇవాళ కొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు ఉన్నాయి. మొత్తంగా, ఇవాళ సానుకూల దృక్పథంతో ఉంటే చాలా వరకు సమస్యలను అధిగమించవచ్చు.
మేష రాశి: Feb 05 Horoscope | ఆఫీసులో గొడవలకు దూరంగా ఉండండి, లేదంటే ఉద్యోగానికి ఇబ్బంది కలగవచ్చు. కొత్త స్నేహాలు, ప్రేమ కలిగే అవకాశం ఉంది. కానీ, వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి. ఇవాళ మీరు చేసే పనులు మంచి లాభాలను తెచ్చిపెడతాయి.
వృషభ రాశి: Feb 05 Horoscope | భయం, ఈర్ష్య వంటి నెగటివ్ ఆలోచనలు వదిలేయండి. బంధువులతో ఉన్న పాత గొడవలు వదిలేసి, అందరితో కలిసి ఉండటానికి ప్రయత్నిస్తారు. పన్నుల విషయంలో నిజాయితీగా ఉండండి.
మిథున రాశి: Feb 05 Horoscope | పర్యావరణానికి సంబంధించిన రంగాల్లో పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయి. ప్రయాణాల వల్ల ఒత్తిడి, ఆందోళన కలిగే అవకాశం ఉంది. కాబట్టి, వాటిని వాయిదా వేయడం మంచిది. అనుభవం ఉన్న పెద్దల సలహాలను తీసుకోండి.. అవి మీ భవిష్యత్తుకు ఉపయోగపడతాయి.
కర్కాటక రాశి: Feb 05 Horoscope | మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి. అది మీ సమస్యలను పరిష్కరించడమే కాకుండా మీకు దారి చూపిస్తుంది. ఆఫీసులో మీ పనికి ప్రశంసలు అందుతాయి. వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి. జీవిత భాగస్వామి మీకు ఒక మంచి సర్ప్రైజ్ ఇస్తారు.
సింహ రాశి: సానుకూల ఆలోచనల వల్ల ఇవాళ మీరు చేసే పనుల్లో విజయం సాధిస్తారు. అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు. పెళ్లి ప్రయత్నాలు చేసేవారికి మంచి సంబంధం కుదురుతుంది. బంధువులు, భాగస్వామి నుంచి శుభవార్త వింటారు. దైవచింతన, ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి పెట్టడం వలన మనశ్శాంతి లభిస్తుంది. ఏదైనా పెద్ద ఒప్పందాలపై సంతకం చేసే ముందు ఒక్కటికి రెండుసార్లు ఆలోచించండి.
కన్యా రాశి: ఇంట్లోని పెద్దలు ఆర్థికంగా సహాయం చేస్తారు. స్నేహం ప్రేమగా మారే అవకాశం ఉంది. అనుభవజ్ఞుల సలహాలు భవిష్యత్తుకు మేలు చేస్తాయి. అలాగే ఇవాళ ఆఫీసు పనులను అనుకున్న సమయం కంటే ముందుగానే పూర్తిచేస్తారు.
తులా రాశి: గ్రహ గతి అనుకూలంగా ఉండటం వల్ల మంచి ధనలాభం కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. నమ్మే వ్యక్తులు మీకు పూర్తి నిజాన్ని చెప్పకపోవచ్చు. అయితే, మీ మాటకారితనంతో వచ్చే సమస్యలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. జీవిత భాగస్వామి ఆరోగ్యం కాస్త ఇబ్బంది కలిగించవచ్చు. మీరు చేస్తున్న నిరంతర కృషికి ఇవాళ తగిన ప్రతిఫలం లభిస్తుంది.
వృశ్చిక రాశి: ముఖ్యమైన వ్యక్తుల నుంచి ఆర్థిక సహాయం అందే అవకాశం ఉంది. లక్ష్యాలను సాధించే వరకు ఎవరికీ చెప్పకండి. మౌనంగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. మీ మాటతీరు వల్ల తల్లిదండ్రులు బాధపడే అవకాశం ఉంది.
ధనుస్సు రాశి: పెట్టుబడులు, వ్యాపార అంచనాలు (Speculation) లాభాలను తెచ్చిపెడతాయి. ధైర్యంగా సొంత నిర్ణయాలు తీసుకోవడం మంచిది. పిల్లల నుంచి కొన్ని మంచి విషయాలు నేర్చుకుంటారు.
మకర రాశి: మీ సానుకూల ఆలోచనలతో ఇతరులను సులభంగా ఆకట్టుకుంటారు. కొత్తగా ప్రారంభించే పనులు, బిజినెస్ ఒప్పందాలు మంచి లాభాలను తెచ్చిపెడతాయి. ప్రేమ విషయంలో మూడో వ్యక్తి తలదూర్చడం వలన మనస్పర్థలకు దారి తీయవచ్చు.
కుంభ రాశి: ఇవాళ దైవ కార్యక్రమాల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. దీనివల్ల మీకు మనశ్శాంతి లభిస్తుంది. కొత్త ప్రాజెక్టులు, పనులు మొదలుపెట్టడానికి ఇది చాలా మంచి రోజు. దగ్గరి వారితో చిన్నపాటి గొడవలు, మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది.
మీన రాశి: ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది, ధన లాభం కలుగుతుంది. మీ తెలివితేటలు, చేసే పనులకు మంచి గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి. ధ్యానం (Meditation) చేయడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది.