అక్షరటుడే, గాంధారి: Beedi workers | పండుగకు కూడా తమకు ఇబ్బందులు తప్పట్లేదని బీడీ కార్మికులు (Beedi workers) వాపోతున్నారు.. బీడీ కంపెనీ డబ్బులు విడుదల చేసినప్పటికీ బ్యాంకు అధికారుల (bank officials) నిర్వాకంతో తమకు డబ్బులు అందట్లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Beedi workers | వివరాల్లోకి వెళ్తే..
సదాశివనగర్ మండల (Sadashivanagar mandal) కేంద్రంలోని యూనియన్ బ్యాంక్ ఉంది. ఈ బ్యాంక్‌లోనే బీడీ కంపెనీ నిర్వాహకులు కార్మికుల నిమిత్తం డబ్బులు జమ చేస్తారు. బీడీ కంపెనీ మునీంలు వాటిని విత్‌డ్రా చేసి కార్మికులకు డబ్బులు అందజేయాల్సి ఉంటుంది. అయితే సదరు బీడీ కంపెనీ నిధులు విడుదల చేసినప్పటికీ బ్యాంకు అధికారులు మునీంలకు డబ్బులు ఇవ్వకపోవడంతో వారు బీడీ కార్మికులకు డబ్బులు ఇచ్చే అవకాశం లేకుండా పోయింది. పేదవాళ్లకు బీడీవృత్తే ప్రధాన ఆధారం. అలాంటిది పండుగ సమయంలో తమకు డబ్బులు విడుదల చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని బీడీ కార్మికులు వాపోతున్నారు.
Beedi workers | ప్రతినెలా ఇదే పరిస్థితి..
బీడీ కంపెనీ నిర్వాహకులు సమయానికి కార్మికులకు చెల్లించాల్సిన డబ్బులను ముందుగానే ఆయా సంబంధిత బీడీ కార్ఖానా మునీంల అకౌంట్లలో జమచేస్తారు. అయితే ఆ డబ్బును తీసుకొచ్చి బీడీ కార్మికులకు పంచడం జరుగుతుంది. యూనియన్ బ్యాంక్‌లో సిబ్బంది మాత్రం అకౌంట్లలో డబ్బులు ఉన్నప్పటికీ మునీంలకు ఇవ్వకపోవడంతో వారు కార్మికులకు డబ్బులు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది.
Beedi workers | అందరికీ సమానంగా ఇవ్వాల్సి ఉంటుంది..
– అర్వింద్, యూనియన్ బ్యాక్ మేనేజర్
మా బ్యాంక్‌కు సంబంధించి రోజుకు రూ.8లక్షలు మాత్రమే వస్తున్నాయి. వాటిని బ్యాంకులో అన్ని లావాదేవీలకు వినియోగించాల్సి ఉంటుంది. ఒకే వ్యక్తికి రూ. 2లక్షలు ఇవ్వాలంటే కష్టమైన పని. అందరికీ సమానంగా ఇవ్వాల్సి ఉంటుంది.