Farooq abdullah | కాంగ్రెస్‌పై ఫరూక్ అబ్దుల్లా విమ‌ర్శ‌లు.. ప్ర‌ధానిపై విమ‌ర్శ‌ల‌ను ఖండించిన మాజీ సీఎం

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Farooq abdullah | మిత్ర‌ప‌క్ష‌మైన కాంగ్రెస్ పార్టీపై నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా బుధవారం తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ చేసిన “గయాబ్”ను తీవ్రంగా ఖండించారు. ఉగ్ర‌వాదుల‌పై చ‌ర్య‌ల‌కు పూర్తి మద్దతు ఇస్తామని హామీ ఇచ్చిన తర్వాత ఇలా రాజకీయం చేయ‌డం త‌గ‌ద‌ని, ప్రధానమంత్రిని ప్రశ్నించడం ఇక‌నైనా మానుకోవాలని హిత‌వు ప‌లికారు. 26 మంది పౌరులను బలిగొన్న పహల్​గామ్​ ఉగ్రవాద దాడి […]

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Farooq abdullah | మిత్ర‌ప‌క్ష‌మైన కాంగ్రెస్ పార్టీపై నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా బుధవారం తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ చేసిన “గయాబ్”ను తీవ్రంగా ఖండించారు. ఉగ్ర‌వాదుల‌పై చ‌ర్య‌ల‌కు పూర్తి మద్దతు ఇస్తామని హామీ ఇచ్చిన తర్వాత ఇలా రాజకీయం చేయ‌డం త‌గ‌ద‌ని, ప్రధానమంత్రిని ప్రశ్నించడం ఇక‌నైనా మానుకోవాలని హిత‌వు ప‌లికారు. 26 మంది పౌరులను బలిగొన్న పహల్​గామ్​ ఉగ్రవాద దాడి తర్వాత ప్రధానమంత్రి కనిపించడం లేదంటూ కాంగ్రెస్ పార్టీ మోదీని ఉద్దేశించి మంగ‌ళ‌వారం త‌న ఎక్స్ హ్యాండిల్‌లో “గయాబ్” అని ఓ ఫొటో పెట్టింది. నేరుగా మోదీ ఫొటో, పేరు లేక‌పోయిన‌ప్ప‌టికీ, ఆ ఆహార్యాన్ని బ‌ట్టి ప్ర‌ధానిని ఉద్దేశించే పెట్టింది. దీనిపై దేశ‌వ్యాప్తంగా తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్త‌డంతో కాంగ్రెస్ ఆ పోస్టును డిలీట్ చేసింది. ఈ వివాదంపై అబ్దుల్లా తాజాగా స్పందించారు.

Farooq abdullah | మిత్ర‌ప‌క్షంపై విమ‌ర్శ‌లు

జ‌మ్మూకాశ్మీర్‌లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న అబ్దుల్లా.. ఆ పార్టీ తీరుపై మండిప‌డ్డారు. మోదీపై కాంగ్రెస్ చేసిన విమ‌ర్శ‌ల‌ను ఖండిస్తూ ప్రధానమంత్రి ఢిల్లీలోనే ఉన్నారని, ఈ పరీక్షా సమయాల్లో ఆయన “తప్పిపోయిన” ప్రశ్నే లేదన్నారు. “ఆయన ఎక్కడ తప్పిపోయాడు? ఆయన ఢిల్లీలో ఉన్నారని నాకు తెలుసు” అని అబ్దుల్లా పేర్కొన్నారు. ఈ కీలక సమయంలో ప్రభుత్వం తీసుకునే ఏ చర్యలోనైనా తమ పార్టీ ప్రధానమంత్రికి పూర్తి మద్దతు ఇస్తుందని స్ప‌ష్టం చేశారు. “మేము ప్రధానమంత్రికి మా పూర్తి మద్దతు ఇచ్చాము. ఆ తర్వాత, మమ్మల్ని ప్రశ్నించకూడదు. ప్రధానమంత్రి తనకు అవసరమైన ఏ పని అయినా చేయాలి” అని అన్నారు.

Farooq abdullah | పాక్‌పై మా వైఖ‌రి మారింది..

పాకిస్తాన్ పట్ల తరచుగా మెతక వైఖరి అవలంబిస్తుందని ఆరోపణలు ఎదుర్కొంటున్న అబ్దుల్లా తాజాగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మొన్న‌టిదాకా తాను పాకిస్తాన్‌తో సంభాషణకు అనుకూలంగా ఉండేవాడినని, కానీ పొరుగు దేశం కాశ్మీర్‌లోని పహల్​గామ్‌లో మానవత్వాన్ని హత్య చేసిందని అన్నారు. “నేను ప్రతిసారీ పాకిస్తాన్‌తో చ‌ర్చ‌ల‌కు అనుకూలంగా ఉండేవాడిని.. కానీ ఆప్తుల‌ను వారిని కోల్పోయిన వారికి మనం ఏం సమాధానం చెబుతాము? మనం న్యాయం చేస్తున్నామా? బాలాకోట్ కాదు, నేడు ఈ రకమైన దాడులు ఎప్పుడూ జరగకుండా అలాంటి చర్య తీసుకోవాలని దేశం కోరుకుంటోంది” అని ఆయన అన్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...