అక్షరటుడే, ఆర్మూర్: Armoor | మొక్కజొన్న డబ్బులను వెంటనే చెల్లించాలని భారతీయ జనతా కిసాన్ మోర్చా (BJP Kisan Morcha) ఆర్మూర్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియాకు (Sub-Collector Abhigyan Malviya) వినతిపత్రం అందజేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ.. మొక్కజొన్న మార్కెట్ ద్వారా కొనుగోలు చేసి ఇప్పటికి సుమారు నెలరోజులు గడిచిపోయినా రైతుల ఖాతాల్లో డబ్బులు వేయకపోవడం విచారకరమన్నారు. దీంతో పాటు రబీకి సంబంధించి బోనస్ కూడా ప్రభుత్వం ఇప్పటివరకు వేయలేదన్నారు.
వెంటనే రబీ బోనస్‌తో పాటు ఖరీఫ్ బోనస్‌ను (Kharif bonus) కలిపి రైతు ఖాతాలో యుద్ధ ప్రతిపాదికన వేయాలని బీజేపీ మోర్చా నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకుడు నూతల శ్రీనివాస్ రెడ్డి, జిల్లా జనరల్ సెక్రెటరీ పుల్కం వేణు, కిషన్, మోర్చా పట్టణ అధ్యక్షుడు శేషగిరి లింగం, బీజేపీ పట్టణ అధ్యక్షుడు మందుల బాలకృష్ణ, పట్టణ ప్రధాన కార్యదర్శి ఖాందేష్ ప్రశాంత్, బీజేవైఎం పట్టణ ఉదయ్ గౌడ్, ఉపాధ్యక్షుడు పోచంపాడు శ్రీనివాస్, పిట్ల శ్రీధర్, కలిగోట ప్రశాంత్, మనీష్, శంకర్, సాగర్, పోశెట్టి రైతులు పాల్గొన్నారు.
