Re-Release Movies | జులైలో ఎన్ని సినిమాలు రీరిలీజ్‌ కాబోతున్నాయో తెలుసా.. ప్రేక్ష‌కుల‌కు ఫుల్ జోష్

అక్షరటుడే, వెబ్​డెస్క్ :Re-Release Movies | టాలీవుడ్​లో ఇటీవల రీ రిలీజ్(Re-Release) ట్రెండ్ నడుస్తోంది. స్టార్స్ బ‌ర్త్ డేలు, లేదంటే మూవీ యానివ‌ర్స‌రీ స‌మ‌యంలో అప్ప‌ట్లో ప్రేక్ష‌కుల‌ను అలరించిన సినిమాలను రీరిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో జులైలో కొత్త సినిమాల హడావుడి కన్నా.. రీ రిలీజ్ కానున్న పాత చిత్రాల హంగామానే ఎక్కువ‌గా క‌నిపించ‌నుంది. ఏకంగా ఆరు క్లాసిక్ చిత్రాలు తిరిగి థియేట‌ర్స్‌(Theaters)లో సంద‌డి చేయ‌నున్నాయని తెలిసి ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. 2025 జులైలో థియేట్రికల్ […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ :Re-Release Movies | టాలీవుడ్​లో ఇటీవల రీ రిలీజ్(Re-Release) ట్రెండ్ నడుస్తోంది. స్టార్స్ బ‌ర్త్ డేలు, లేదంటే మూవీ యానివ‌ర్స‌రీ స‌మ‌యంలో అప్ప‌ట్లో ప్రేక్ష‌కుల‌ను అలరించిన సినిమాలను రీరిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో జులైలో కొత్త సినిమాల హడావుడి కన్నా.. రీ రిలీజ్ కానున్న పాత చిత్రాల హంగామానే ఎక్కువ‌గా క‌నిపించ‌నుంది. ఏకంగా ఆరు క్లాసిక్ చిత్రాలు తిరిగి థియేట‌ర్స్‌(Theaters)లో సంద‌డి చేయ‌నున్నాయని తెలిసి ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. 2025 జులైలో థియేట్రికల్ రీ రిలీజ్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమాలు ఫ్యాన్స్‌కు మాంచి కిక్ ఇవ్వ‌డం ఖాయమని అంటున్నారు.

Re-Release Movies | ఏకంగా ఆరు రీరిలీజ్‌లు..

రీరిలీజ్ జాబితాలో ముందుగా చూస్తే.. ఎం.ఎస్.ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ – జులై 7న విడుద‌ల కానుంది. ధోని జీవిత నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రం పెద్ద విజ‌య‌మే సాధించింది. ఇప్పుడు తిరిగి రీరిలీజ్ చేస్తున్నారు.

ఇక కుమారి 21ఎఫ్ – జులై 10న రీ రిలీజ్ కానుంది. ఈ చిత్రం కూడా సూప‌ర్ డూప‌ర్ హిట్ సాధించింది. ర‌వితేజ న‌టించిన మిరపకాయ్ – జులై 11న విడుద‌ల కానుండ‌గా, ఈ సినిమా ర‌వితేజ ఫ్యాన్స్​కు మాంచి కిక్ అందించ‌డం ఖాయం. ఆ త‌ర్వాత గ‌జిని (తమిళం) – జులై 18న విడుద‌ల కానుంది. సూర్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది ఈ చిత్రం.

ఇక స‌మంత‌, నాగ చైత‌న్య జంటగా న‌టించిన ఏ మాయ చేసావే – జులై 18న రీరిలీజ్ కానుంది. ఈ సినిమా స‌మయంలోనే నాగ చైత‌న్య‌, స‌మంత ప్రేమ‌లో ప‌డ్డారు. ఈ మూవీ వారిద్ద‌రి కెరీర్‌లో ఇప్పటికీ స్పెష‌ల్ అనే చెప్పాలి. ఇక వీడొక్కడే – జులై 19న రీరిలీజ్ కానుంది. ఈ సినిమాకి ప్ర‌త్యేక‌మైన ఫాలోయింగ్ ఉంది.

ఈ నెల‌లో రీరిలీజ్ కాబోతున్న చిత్రాలు బయోపిక్, రొమాన్స్, యాక్షన్, థ్రిల్లర్ లాంటి విభిన్న క‌థాంశంతో రూపొంది ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదం పంచాయి. ఇందులో కొన్ని చిత్రాలు కల్ట్ క్లాసిక్స్‌(Cult Classics)గా నిలిచాయి. ఈ రీ-రిలీజ్‌ల ద్వారా పాత జ్ఞాపకాలను మళ్లీ గుర్తు చేసుకునే అవకాశం ఉండగా, కొత్తగా చూసే ప్రేక్షకులకు మాత్రం మొదటిసారి థియేటర్​లో వీటిని ఆస్వాదించే అవకాశం లభించనుంది.

Related articles

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...

Kalyan Jeweller: రంగుల పండుగ కోసం కల్యాణ్ జువెలర్స్ ప్రత్యేక కానుక.. ‘ది క్యూరేటెడ్ హోలీ ఎడిట్’ విడుదల

హైదరాబాద్: దేశీయ ప్రముఖ ఆభరణాల సంస్థ కల్యాణ్ జువెలర్స్, హోలీ పండుగ సంబరాలను పురస్కరించుకుని సరికొత్త ఆభరణాల శ్రేణి 'కలర్‌ఫుల్ స్టేట్‌మెంట్స్: ది క్యూరేటెడ్...