Home » Kadapa | రైలు కింద పడి కుటుంబం ఆత్మహత్య

Kadapa | రైలు కింద పడి కుటుంబం ఆత్మహత్య

by tinnu
0 comments
kadapa

అక్షరటుడే, వెబ్​డెస్క్: Kadapa | ఆంధ్రప్రదేశ్​లోని కడప జిల్లాలో (Kadapa district) తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ కుటుంబం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఆదివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది.

జిల్లా కేంద్రంలోని శంకరాపురానికి చెందిన శ్రీరాములు (35), శిరీష (30) దంపతులు. వారికి ఏడాదిన్నర కుమారుడు రిత్విక్​ ఉన్నారు. అయితే ఏం కష్టం వచ్చిందో ఏమో గాని ఆదివారం రాత్రి ఆ దంపతులు తమ కుమారుడితో కలిసి రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డారు. కడప- కృష్ణాపురం రైల్వే స్టేషన్ల మధ్య వేగంగా వస్తున్న గూడ్స్‌ ట్రైన్​కు (goods train) వారు ఎదరుగా వెళ్లారు. రైలు ఢీకొట్టడంతో వారి మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పరిశీలించారు.

Kadapa | గుండెపోటుతో నానమ్మ మృతి

కుటుంబ కలహాలతోనే వారు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. శ్రీరాములు, శిరీష గొడవ పడటంతో ఆయన నానమ్మ ఆదివారం రాత్రి వారిని మందలించినట్లు తెలిసింది. దీంతో కుటుంబంతో సహా శ్రీరాములు ఇంటి నుంచి బయటకు వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా వారు బయటకు వెళ్లిన కాసేపటికే శ్రీరాములు నానమ్మ సైతం గుండెపోటుతో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఒకేరోజు చనిపోవడంపై స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు (investigating). వారి ఆత్మహత్యకు ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో సైతం విచారణ చేపడుతున్నారు.

You may also like