అక్షరటుడే, కోటగిరి : Arrive Alive | రోడ్డు ప్రమాదాలతో (Road Accidents) కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయని ఎస్సై సునీల్ (SI Sunil) అన్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులతో ‘అరైవ్, అలైవ్’ కార్యక్రమాన్ని శుక్రవారం పోతంగల్ మండల (Potangal Mandal) కేంద్రంలో నిర్వహించారు.
Arrive Alive | మద్యం తాగి వాహనాలు నడపొద్దు
ఎస్సై మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనాలు నడుపొద్దన్నారు. సెల్ఫోన్ మాట్లాడుతూ వాహనం నడిపితే ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశాలు ఉంటాయన్నారు. బైక్పై వెళ్లేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ వాడాలని సూచించారు. ఆయా గ్రామాల్లో యువకులకు అవగాహన కల్పించే బాధ్యత సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులపై ఉంటుందని వెల్లడించారు.
Arrive Alive | జాగ్రత్తగా ఉండాలి
వాహనాలు ఓవర్టేక్ చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని ఎస్సై సూచించారు. చాలావరకు ప్రమాదాలు ఓటర్టేక్ చేసినప్పుడే జరుగుతున్నాయని చెప్పారు. ఆటోలో ఎక్కువ మందిని తీసుకు వెళ్లకూడదని ఆటో డ్రైవర్లకు సూచించారు. వాహనదారులు ప్రతిఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు బజరంగ్, సర్పంచులు షాజీ పటేల్, జగన్, ఈర్వత్ రావు, ఉప సర్పంచ్ నబీ, సునీల్, విజయ్, పంచాయతీ కార్యదర్శులు యాదవ్, రాము, నాగార్జున, నవీన్, రాజలింగం, పోలీస్ సిబ్బంది, యాదగిరి, అరుణ్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.