HomeUncategorizedMP Arvind | టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి.. కేంద్ర మంత్రికి ఎంపీ అర్వింద్​ వినతి

MP Arvind | టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి.. కేంద్ర మంత్రికి ఎంపీ అర్వింద్​ వినతి

ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్​ను నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్​ విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: MP Arvind | ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్​ను (Education Minister Dharmendra Pradhan) నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్​ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయనను కలిసి వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్​ (Nizamabad MP Dharmapuri Arvind) మాట్లాడుతూ నిజామాబాద్ లోక్​సభ నియోజకవర్గంలో సుమారు మూడు వేల మంది ఉపాధ్యాయులపై ప్రభావం పడుతుందన్నారు. చాలా ఏళ్లుగా సేవ చేస్తున్న ఉపాధ్యాయుల ప్రయోజనాలను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా.. ఇటీవల కేంద్ర ప్రభుత్వం 2010కి ముందు ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TET) తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

Must Read
Related News