అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Nizamabad | ఎక్సైజ్ కానిస్టేబుల్ (Excise Constable) సౌమ్యకు న్యాయం చేయాలని ఆ శాఖ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. శనివారం జిల్లా ఎక్సైజ్ కార్యాలయం (District Excise Office) ఎదుట విధులు బహిష్కరించి నిరసన తెలిపారు.
గంజాయి తరలిస్తున్న వ్యక్తులు కానిస్టేబుల్ సౌమ్యను (Constable Soumya) శుక్రవారం రాత్రి కారుతో ఢీకొన్న విషయం తెలిసిందే. గంజాయి రవాణా చేస్తున్నారనే సమాచారంతో తనిఖీలు చేపట్టగా.. నిందితులు కారు ఆపకుండా సౌమ్యను ఢీకొట్టారు. దీంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. ఆమెను పోలీసులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ ఘటనపై ఎక్సైజ్ పోలీసులు (Excise Police) ఆగ్రహం వ్యక్తం చేశారు. సౌమ్యకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
Nizamabad | సూపరింటెండెంట్‌ను నిలదీసిన ఉద్యోగులు
ఎక్సైజ్ ఉద్యోగులు సూపరింటెండెంట్ మల్లారెడ్డిని (Superintendent Mallareddy) నిలదీశారు. గంజాయి కేసులో విషయంలో ఉన్నతాధికారులు కింది స్థాయి సిబ్బందిని వేధిస్తున్నారని ఆరోపించారు. వారి పదోన్నతుల కోసం సిబ్బందిని బలి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సౌమ్య కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎక్సైజ్ ఉన్నతాధికారులు వారికి సర్ది చెప్పారు.