అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Bathukamma | సుభాష్ననగర్ ఎక్సైజ్ కార్యాలయంలో బుధవారం ఎక్సైజ్ శాఖ (Excise Department) ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మహిళా ఉద్యోగులు రంగురంగుల పూలతో బతుకమ్మలను తయారుచేశారు. అనంతరం ఉద్యోగులంతా ఉత్సాహంగా ఆడిపాడారు. కార్యక్రమంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి, ఎస్హెచ్వో స్వప్న, సీఐలు వెంకటేష్, విలాస్, ఎస్సైలు మల్లేష్, సింధూ, సుష్మిత, ఎక్సైజ్ ఉద్యోగుల యూనియన్ అధ్యక్షుడు రవి తదితరులు పాల్గొన్నారు.