Exam Center Security | పరీక్ష కేంద్రాల్లో మాల్​ ప్రాక్టీస్​కు తావులేకుండా చర్యలు తీసుకోవాలి: కలెక్టర్​ ఇలా త్రిపాఠి

ఇంటర్​ పరీక్ష కేంద్రాల్లో మాల్​ ప్రాక్టీస్​కు తావులేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్​ ఇలా త్రిపాఠి అన్నారు. బోధన్​ పట్టణంలోని జూనియర్​ కళాశాలలో పరీక్ష కేంద్రాన్ని గురువారం ఆమె తనిఖీ చేశారు.

అక్షరటుడే, బోధన్: Exam Center Security | ఇంటర్​ పరీక్ష కేంద్రాల్లో మాల్​ ప్రాక్టీస్​కు తావులేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్​ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) అన్నారు. బోధన్​ పట్టణంలోని జూనియర్​ కళాశాలలో పరీక్ష కేంద్రాన్ని గురువారం ఆమె తనిఖీ చేశారు.

Exam Center Security | పట్టణంలోని తొమ్మిది కేంద్రాల్లో..

పట్టణంలోని తొమ్మిది కేంద్రాల్లో ఇంటర్​ సెకండియర్​ పరీక్షలు గురువారం ప్రారంభం కాగా.. కలెక్టర్​ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. అనంతరం ఆమె అధికారులతో మాట్లాడారు. పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. కేంద్రాలకు సమీపంలో ఉన్న జిరాక్స్​ సెంటర్లను మూసి ఉంచేలా పోలీసులు పర్యవేక్షణ చేయాలన్నారు.

సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి..

పరీక్షలు జరుగుతున్న సమయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. పట్టణంలోని తొమ్మిది సెంటర్లలో 3,007 విద్యార్థులకు గాను గురువారం 2,920మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. కలెక్టర్​ వెంట సబ్​ కలెక్టర్​ వికాస్​ మహతో (Sub-Collector Vikas Mahato), అధికారులు ఉన్నారు.

Related articles

Kharge Jaggareddy Meeting | ఖర్గేను కలిసిన జగ్గారెడ్డి.. రాజ్యసభ సభ్యులపై వినతి

కాంగ్రెస్​ జాతీయ​ అధ్యక్షుడు మల్లికార్జున్​ ఖర్గేను జగ్గారెడ్డి కలిశారు. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ స్థానాల్లో వి హనుమంత్​రావు, జెట్టి కుసుమకుమర్​కు అవకాశం ఇవ్వాలని కోరారు.

BC Reservations Congress | కాంగ్రెస్​ హయాంలోనే బీసీలకు ప్రాధాన్యత..:​ ఈరవత్రి అనిల్​

రాష్ట్రంలో కాంగ్రెస్​ ప్రభుత్వ హయాంలో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ఖనిజాభివృద్ధి సంస్థ ఛైర్మన్​ ఈరవత్రి అనిల్​ అన్నారు.

NCERT Book Ban | ఎన్​సీఈఆర్​టీపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. పుస్తకంపై నిషేధం

ఎన్​సీఈఆర్​టీపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎనిమిదో తరగతి సోషల్​ సైన్స్​ పుస్తకాన్ని నిషేధించింది.

Chain Snatching Kotagiri | కోటగిరిలో చైన్​స్నాచింగ్​.. మూడు తులాల గొలుసు అపహరణ..

జిల్లాలో వరుస చైన్​స్నాచింగ్​ ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. గ్రామాల్లో, పట్టణాల్లో అనే తేడాలేకుండా ఎక్కడ పడితే అక్కడ దోపిడీకి తెగబడుతున్నారు.