Bonalu Festival | ఉజ్జయిని మహంకాళి బోనాలకు సర్వం సిద్ధం

అక్షరటుడే, వెబ్​డెస్క్: Bonalu Festival | భాగ్యనగరంలో బోనాల సందడి (Bonalu Festival) నెలకొంది. ఆషాఢ మాసం సందర్భంగా హైదరాబాద్​–సికింద్రాబాద్​ జంట నగరాల్లో ఘనంగా బోనాల పండుగ నిర్వహిస్తున్నారు. జూన్​ 26న గోల్కొండలో జగందాబిక అమ్మవారికి బోనాలు (Golconda Bonalu) సమర్పించడంతో పండుగ ప్రారంభమైంది. ఆదివారం నుంచి మంగళవారం వరకు సికింద్రాబాద్​లోని ఉజ్జయిని మహంకాళి (Ujjain Mahakali) అమ్మవారి బోనాలు వైభవంగా కొనసాగనున్నాయి. Bonalu Festival | పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం ఉజ్జయిని మహంకాళి అమ్మవారి […]

అక్షరటుడే, వెబ్​డెస్క్: Bonalu Festival | భాగ్యనగరంలో బోనాల సందడి (Bonalu Festival) నెలకొంది. ఆషాఢ మాసం సందర్భంగా హైదరాబాద్​–సికింద్రాబాద్​ జంట నగరాల్లో ఘనంగా బోనాల పండుగ నిర్వహిస్తున్నారు. జూన్​ 26న గోల్కొండలో జగందాబిక అమ్మవారికి బోనాలు (Golconda Bonalu) సమర్పించడంతో పండుగ ప్రారంభమైంది. ఆదివారం నుంచి మంగళవారం వరకు సికింద్రాబాద్​లోని ఉజ్జయిని మహంకాళి (Ujjain Mahakali) అమ్మవారి బోనాలు వైభవంగా కొనసాగనున్నాయి.

Bonalu Festival | పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం

ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వేలాది మంది భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించుకోవడానికి వస్తారు. ఈ క్రమంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. బోనాల సందర్భంగా అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.

ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఆలయ ధర్మకర్త కుటుంబం నుంచి తొలి బోనం సమర్పించడంతో పండుగ ప్రారంభం అవుతుంది. జూలై 14న రంగం భవిష్యవాణితో పాటు అమ్మవారి అంబారి ఊరేగింపు ఘనంగా నిర్వహిస్తారు. ఈ రెండు రోజులు ఫలహార బండ్ల ఊరేగింపు కూడా సందడిగా చేపడతారు. ఈ కార్యక్రమాల్లో వేలాది మంది భక్తులు పాల్గొంటారు. దీంతో సికింద్రాబాద్​ అంతా రెండు రోజుల పాటు ఆధ్యాత్మిక శోభ సంతరించుకోనుంది.

Bonalu Festival | నగరంలో ట్రాఫిక్​ ఆంక్షలు

ఉజ్జయిని మహంకాళి బోనాల నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్​ ఆంక్షలు (Traffic Restrictions) అమలు చేయనున్నారు. ఈ నెల 13 నుంచి 15 వరకు ప్రయాణికులు ప్యాట్నీ- ప్యారడైజ్- బేగంపేట వైపు రావొద్దని ఇప్పటికే పోలీసులు స్పష్టం చేశారు.

టొబాకో బజార్, హిల్ స్ట్రీట్ నుంచి మహంకాళి ఆలయం, బాటా ఎక్స్ రోడ్ నుంచి రోచా బజార్ వరకు సుభాష్ రోడ్డు, ఔదయ్య ఎక్స్ రోడ్ నుంచి మహంకాళి ఆలయం, జనరల్ బజార్ నుంచి మహంకాళి ఆయం రోడ్లను జులై 13న రాత్రి 12 గంటల నుంచి 15 తెల్లవారుజామున 3 గంటల వరకు మూసివేయనున్నారు. ఆలయం వద్ద ఏర్పాట్లను నగర ట్రాఫిక్​ విభాగం చీఫ్​ జోయెల్ డేవిస్​ శనివారం పరిశీలించారు. భక్తులకు ఇబ్బందులు కల్గకుండా చర్యలు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు.

Bonalu Festival | మద్యం దుకాణాల మూసివేత

బోనాల పండుగ నేపథ్యంలో నగరంలో మద్యం షాపులు (Wine Shops) మూసివేయనున్నారు. 13న ఉదయం ఆరు గంటల నుంచి 15న ఉదయం ఆరు గంటల వరకు వైన్​ షాపులు, బార్లు మూసి ఉంచాలని ఇప్పటికే పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...