Home » Global Summit | తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్​కు సర్వం సిద్ధం.. పటిష్ట బందోబస్తు

Global Summit | తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్​కు సర్వం సిద్ధం.. పటిష్ట బందోబస్తు

by tinnu
0 comments
Global Summit

అక్షరటుడే, వెబ్​డెస్క్: Global Summit | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్​కు (Telangana Rising Global Summit) సర్వం సిద్ధం అయింది. సోమ, మంగళవారాల్లో ఫ్యూచర్​ సిటీలో (Future City) ఈ సదస్సు జరగనుంది.

సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) ఈ సమ్మిట్​ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 44 దేశాల నుంచి 154 మంది అతిథులు హాజరు కానున్నారు. 2 వేల మంది కూర్చొనేలా ప్రారంభ వేదిక సిద్ధం చేశారు. సోమవారం మధ్యాహ్నం 1: 30 గంటలకు సమ్మిట్ ప్రారంభం కానుంది. తొలిరోజు ఆర్థికవేత్త అభిజిత్ బెనర్జీ, ట్రంప్-మీడియా అండ్ టెక్నాలజీస్ నుంచి ఎరిక్ స్వేడర్ స్పీచ్ ఉంటుంది. మధ్యాహ్నం 2: 30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. వివిధ అంశాలపై 27 సెషన్లలో చర్చలు జరగనున్నాయి.

Global Summit | 6 వేల మందితో బందోబస్తు

రెండు రోజుల గ్లోబల్‌ సమ్మిట్‌కు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 6 వేల మంది పోలీసులు బందోబస్తు విధుల్లో పాల్గొంటారని రాచకొండ సీపీ సుధీర్‌ బాబు వెల్లడించారు. ఔటర్‌ రింగ్‌ రోడ్‌ (Outer Ring Road) ఎగ్జిట్‌ నంబర్‌ 14 నుంచి వేదిక వరకు బందోబస్తు ఉంటుందన్నారు. ఇప్పటికే ప్రజా వేదికను ఆధీనంలో తీసుకున్నామని చెప్పారు. సమ్మిట్‌కు వచ్చే అన్ని వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేసి అనుమతిస్తామన్నారు.

Global Summit | పాల్గొననున్న ప్రముఖులు

ఈ వేడుకలకు హాజరు కావాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలువురికి ఆహ్వానం అందించింది. సీఎం స్వయంగా ప్రధాని మోదీని (Prime Minister Modi) ఆహ్వానించారు. వరల్డ్ హెల్త్ ఆర్డనైజేషన్​, వరల్డ్ బ్యాంక్​, ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్, యూనీసెఫ్ ప్రతినిధులతో పాటు పలు సంస్థలకు చెందిన ప్రముఖులు హాజరు కానున్నారు. క్రీడారంగానికి చెందిన పీవీ సింధు, అనిల్ కుంబ్లే, పుల్లెల గోపిచంద్, గగన్ నారంగ్, జ్వాలా గుత్తా వంటి క్రీడా ప్రముఖులు ‘Olympic Gold Quest’ సెషన్‌లో పాల్గొంటారు. సినీ ప్రముఖులు రాజమౌళి, సుకుమార్, రితేష్ దేశ్‌ముఖ్, గుణీత్ మోంగా, అనుపమా చోప్రా వంటి వారు సైతం చర్చలకు హాజరు అవుతారు.

You may also like