అక్షరటుడే, ఇందూరు: Dinesh Kulachari | రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అంతా అవినీతే కనిపిస్తోందని.. అమలు కాని హామీలే ఉన్నాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి (BJP district president Dinesh Kulachari) పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government) రెండేళ్ల పాలన పూర్తి అవినీతిమయంగా తయారైందన్నారు. అభివృద్ధి కనిపించడం లేదని మోసాలు, నిర్లక్ష్యం పెరిగిపోయిందని విమర్శించారు.
Dinesh Kulachari | జిల్లాలో అభివృద్ధి శూన్యం..
జిల్లాలో అభివృద్ధి చేపట్టడం లేదని దినేష్ అన్నారు. బోధన్ షుగర్ ఫ్యాక్టరీకి (Bodhan Sugar Factory) ఎటువంటి పునరుద్ధరణ చర్యలు చేపట్టలేదని.. సారంగాపూర్ ఫ్యాక్టరీ పూర్తిగా పాడైపోయినా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ యూనివర్సిటీకి (Telangana University) ఒక్క పైసా కూడా నిధులు కేటాయించలేదని దుయ్యబట్టారు. ‘ఇది అభివృద్ధి కాదు.. జిల్లావారిని మోసం చేసే పాలన’ అన్నారు.
Dinesh Kulachari | విమానాశ్రయం విషయంలో..
విమానాశ్రయం విషయంలో కాంగ్రెస్ నేతల తీరు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పేర్కొన్నారు. నిజామాబాద్‌కు కాకుండా ఆదిలాబాద్‌కు సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఎయిర్పోర్ట్ ప్రకటిస్తే మన జిల్లా నేతలు సీఎంను సన్మానించడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు.
జిల్లా ప్రయోజనాలు పక్కనబెట్టి అధికారపక్షం మురికి రాజకీయాలు చేస్తోందని ఆయన అన్నారు. ప్రస్తుతం గ్రామాల్లో కనిపిస్తున్న లైటింగ్ నుంచి రోడ్ల వరకు అన్నీ కేంద్ర ప్రభుత్వం పంపిన నిధులతోనే సమకూరాయన్నారు. గ్రామాల బడ్జెట్, స్మార్ట్ స్ట్రీట్‌లైట్స్, పీఎం గ్రామ సడక్ యోజన, జల్ జీవన్ మిషన్ కార్యక్రమాలు (Jal Jeevan Mission program) కేంద్ర ప్రభుత్వం ద్వారానే నడుస్తున్నాయని స్పష్టం చేశారు.
Dinesh Kulachari | నిజాయితీగా వ్యవహరించే సర్పంచ్‌లను గెలిపించాలి..
ధర్మానికి కట్టుబడి, ప్రజల కోసం నిజాయితీగా పనిచేసే సర్పంచ్ అభ్యర్థులనే గెలిపించుకోవాలని సూచించారు. పార్టీల కంటే ప్రజల సేవే ముఖ్యమని భావించే నాయకుల్ని ముందుకు తేవాలన్నారు. జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎన్నికల్లో గెలిచిన, ఓడిపోయిన నాయకులు అవినీతిలో మాత్రం ముందున్నారని ఆరోపించారు.
ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పోతనకర్ లక్ష్మీనారాయణ, నాగోల్ల లక్ష్మీ నారాయణ, దళిత మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివాజీ, ప్రమోద్, మాస్టర్ శంకర్, జిల్లా కార్యదర్శి జ్యోతి, మండల అధ్యక్షులు తారక్ వేణు, ఇప్పకాయల కిషోర్, గడ్డం రాజు, బీజేపీ సీనియర్ నాయకులు మల్లేష్ గుప్తా, పంచారెడ్డి శ్రీధర్, బూరుగుల వినోద్, యాదల నరేష్, అమందు విజయ్ కృష్ణ, శ్రీధర్, భూపతి, హరీష్ పాల్గొన్నారు.
