అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Vigilance Week | ప్రజలంతా అవినీతికి వ్యతిరేకంగా నిలబడాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (CP Sai Chaitanya) పిలుపునిచ్చారు. విజిలెన్స్ వారోత్సవాల్లో భాగంగా యాంటీ కరప్షన్ బ్యూరో ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలో శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు.
ముందుగా పాత కలెక్టరేట్ గ్రౌండ్ (Old Collectorate Ground) నుంచి ర్యాలీని పోలీస్ కమిషనర్ సాయిచైతన్య ప్రారంభించారు. పాత కలెక్టరేట్ మైదానం నుంచి ప్రారంభమైన ర్యాలీ ప్రధాన వీధుల గుండా సాయిరెడ్డి పెట్రోల్ పంప్ (Sai Reddy Petrol Pump) వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ అవినీతి వల్ల వచ్చే ఇబ్బందులను ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు.
అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్ గురువారం రాష్ట్ర రాజధానిలో ఒక క్యూఆర్ కోడ్ను విడుదల చేశారన్నారు. ఎవరైనా అవినీతికి పాల్పడినట్లయితే క్యూఆర్ కోడ్ ద్వారా వివరాలు తెలియపర్చవచ్చన్నారు. అవినీతికి వ్యతిరేకంగా నిలబడి పేద మధ్యతరగతి ప్రజలకు అన్ని సర్వీసులు అందే విధంగా న్యాయం చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ బస్వారెడ్డి (Additional DCP Baswa Reddy), వన్ టౌన్ ఎస్హెచ్వో రఘుపతి (One Town SHO Raghupathi) తదితరులు పాల్గొన్నారు.

