అక్షరటుడే, ఇందూరు: National Voters Day | ప్రజాస్వామ్యంలో ఎంతో విలువైన ఓటు హక్కు ప్రాధాన్యతను ప్రతి ఒక్కరూ గుర్తించాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ (Additional Collector Kiran Kumar) సూచించారు. 18 ఏళ్లు నిండిన వారందరూ ఓటరుగా నమోదు కావడంతో పాటు, ఎన్నికల్లో విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
National Voters Day | జిల్లా కలెక్టరేట్లో..
జిల్లా కలెక్టరేట్లో (Collectorate Nizamabad) శుక్రవారం 16వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని(National Voters Day) నిర్వహించారు. అనంతరం ఎన్నికల్లో ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకుంటామని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటుతామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో ప్రశాంత్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజ్, అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
ముప్కాల్ మండల కేంద్రంలో..
అక్షరటుడే ముప్కాల్: మండలంలోని పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ ఓటరు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముప్కాల్ (Mupkal) మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కేజీబీవీ పాఠశాల విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో తహశీల్దార్ ముంతాజుద్దీన్, ఎంపీవో మోహినుద్దీన్, ఎంఈవో రవి, ప్రధానోపాధ్యాయులు గంగారాం, కేజీబీవీ ఎస్హెచ్వో వినోద, అంగన్వాడీ కార్యకర్తలు, రెవెన్యూ అధికారులు, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.
