అక్షరటుడే, బోధన్ : Blood Donation Camp | రక్తదానం ప్రాణదానమని.. ప్రతిఒక్కరూ రక్తదానం చేయాలని బోధన్ ఏసీపీ శ్రీనివాస్ (Bodhan ACP Srinivas) సూచించారు. అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా బోధన్ పట్టణంలోని పోలీస్స్టేషన్ల ఆధ్వర్యంలో మంగళవారం రక్తదానం శిబిరాలు ఏర్పాటు చేశారు. టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన రక్తదానం శిబిరం (Blood Donation Camp)లో ఆయన రక్తదానం చేసిన అనంతరం మాట్లాడారు.
Blood Donation Camp | మరొకరికి ప్రాణదానం..
ఆపదలో ఉన్న సమయంలో రక్తదానం (Blood Donate) చేయడం ద్వారా ఓ విలువైన ప్రాణాన్ని కాపాడిన వారమవుతామని ఏసీపీ పేర్కొన్నారు. రక్తదానం చేస్తున్నవారిని స్ఫూర్తిగా తీసుకుని మరికొంతమంది ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో పోలీసులతో పాటు ప్రజలు సుమారు 100 మందికి పైగా రక్తదానం చేశారు. బోధన్ రూరల్ సీఐ విజయ్‌బాబు (Bodhan Rural CI Vijay Babu), ఎస్సై మశ్చేందర్‌రెడ్డి, ఎడపల్లి, కోటగిరి, వర్ని ఎస్సైలు, రెడ్‌క్రాస్‌సొసైటీ ప్రతినిధి తోట రాజశేఖర్ తర సిబ్బంది పాల్గొన్నారు.
