అక్షరటుడే, బోధన్ : Bodhan Traffic | ట్రాఫిక్ నియమ నిబంధనలపై ప్రతిఒక్కరికి అవగాహన ఉండాలని బోధన్ ఎస్హెచ్వో వెంకటనారాయణ (Bodhan SHO Venkatanarayana) అన్నారు. ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని ఉషోదయ డిగ్రీ కళాశాలలో (Ushodaya Degree College) విద్యార్థులు ఉపాధ్యాయులకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
Bodhan Traffic | బైక్పై వెళ్లేటప్పుడు హెల్మెట్ ధరించాలి..
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్హెచ్వో వెంకటనారాయణ మాట్లాడుతూ బైక్లు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. కార్లు డ్రైవ్ చేసినప్పుడు సీటు బెల్ట్ పెట్టుకోవాలని.. ట్రాఫిక్ సిగ్నల్స్ (traffic signals) పాటించాలని సూచించారు. వేగాన్ని అదుపులో ఉంచుకొని వాహనాలు నడపాలన్నారు. రోడ్డు ప్రమాదాల కారణంగా ఎన్నో జీవితాలు చిన్నాభిన్నం అవుతున్నాయని.. ఎదుటివారు కూడా ఇబ్బందులు పాలయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. డ్రంకన్ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు కరపత్రాలు, బ్యానర్లు అందజేశారు. అనంతరం అంబేడ్కర్ జంక్షన్ వద్ద కారు, ఆటో డ్రైవర్లకు డ్రంకన్ డ్రైవ్ చేస్తే కలిగే దుష్పరిణామాలను వివరించారు. డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడితే విధించబడే శిక్షల వివరాలను తెలియజేశారు. కార్యక్రమంలో ఎస్సై భాస్కరాచార్య, ట్రాఫిక్ ఎస్సై మహేష్, ఏఎంవీఐ శ్రీనివాస్ కళాశాల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.