43
అక్షరటుడే, లింగంపేట: Farmer Registration | జిల్లాలోని ప్రతి రైతు గుర్తింపు కార్డుకు కోసం ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ రెడ్డి (District Agriculture Officer Mohan Reddy) అన్నారు. లింగంపేట రైతు వేదికలో (Lingampet Rythu Vedika) ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను మంగళవారం ఆయన తనిఖీ చేశారు.
Farmer Registration | గుర్తింపు కార్డు ఉంటేనే పథకాలు
ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అందజేసే పథకాలు రావాలంటే ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి అన్నారు. భవిష్యత్తులో రైతుకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఉంటేనే ప్రభుత్వ పథకాలు, ప్రోత్సాహకాలు అందుతాయన్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట ఏఈవోలు ఉన్నారు.