అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) మంగళవారం సైతం భారీగా పతనమైంది. అయితే కనిష్టాల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో నష్టాలు తగ్గాయి. లార్జ్ క్యాప్ స్టాక్స్‌లో ప్రాఫిట్ బుకింగ్ కొనసాగింది. సెన్సెక్స్ 436 పాయింట్ల నష్టంతో, నిఫ్టీ 120 పాయింట్ల నష్టంతో ముగిశాయి.
యూఎస్ ఫెడ్ రిజర్వ్ పాలసీ సమావేశం నేపథ్యంలో గ్లోబల్ మార్కెట్లు బలహీనంగా ట్రేడ్ అవుతుండడం, భారత్, యూఎస్‌ల మధ్య వాణిజ్య ఒప్పందం విషయంలో అనిశ్చితి కొనసాగుతుండడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. రైస్ దిగుమతులపై యూఎస్ అదనపు సుంకాలు విధించే అవకాశాలు ఉండడం రైస్ స్టాక్స్ పతనమయ్యాయి. ఐటీ సెక్టార్‌లో ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది. మంగళవారం ఉదయం సెన్సెక్స్ 360 పాయింట్ల నష్టంతో ప్రారంభమైంది. అక్కడినుంచి మరో 360 పాయింట్లు నష్టపోయింది. కనిష్టాల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో 565 పాయింట్లు పైకి ఎగబాకింది. నిఫ్టీ (Nifty) 93 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 139 పాయింట్లు కోల్పోయింది. అక్కడినుంచి 195 పాయింట్లు పెరిగింది. చివరికి సెన్సెక్స్ 436 పాయింట్ల నష్టంతో 84,666 వద్ద, నిఫ్టీ 120 పాయింట్ల నష్టంతో 25,839 వద్ద స్థిరపడ్డాయి. గత ఐదు సెషన్లుగా నష్టాల బాటలో పయనిస్తున్న స్మాల్ క్యాప్ ఇండెక్స్ మంగళవారం ఒక శాతానికిపైగా లాభంతో ముగిసింది.
Stock Market | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్‌ఈలో నమోదైన కంపెనీలలో 2,619 కంపెనీలు లాభపడగా 1,554 స్టాక్స్ నష్టపోయాయి. 158 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 67 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 512 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 11 కంపెనీలు అప్పర్ సర్క్యూట్‌ను, 7 కంపెనీలు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి.
Stock Market | ఐటీలో సెల్లాఫ్..
బీఎస్‌ఈలో పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 1.42 శాతం, టెలికాం 0.91 శాతం, రియాలిటీ ఇండెక్స్ 0.94 శాతం, ఇండస్ట్రియల్ 1.16 శాతం, క్యాపిటల్ గూడ్స్ 1.27 శాతం, సర్వీసెస్ ఇండెక్స్ 1.24 శాతం, పవర్ 0.68 శాతం, పీఎస్‌యూ 0.58 శాతం లాభపడ్డాయి. ఐటీ ఇండెక్స్ 1.18 శాతం, ఆటో 0.63 శాతం, మెటల్ 0.33 శాతం నష్టంతో ముగిశాయి. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.27 శాతం, మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.60 శాతం లాభపడగా.. లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.25 శాతం నష్టపోయాయి.
Top Gainers : బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 8 కంపెనీలు లాభాలతో ఉండగా.. 22 కంపెనీలు నష్టాలతో సాగుతున్నాయి. ఎటర్నల్ 2.26 శాతం, టైటాన్ 2.13 శాతం, అదాని పోర్ట్స్ 1.07 శాతం, బీఈఎల్ 0.82 శాతం, బజాజ్ ఫిన్‌సర్వ్ 0.36 శాతం లాభపడ్డాయి.
Top Losers : ఆసియా పెయింట్ 4.61 శాతం, టెక్ మహీంద్రా 1.99 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 1.78 శాతం, టాటా స్టీల్ 1.74 శాతం, మారుతి 1.05 శాతం నష్టపోయాయి.