Home » BJP Dharna | రాష్ట్రంలో పాలన మారినా దోపిడీ ఆగలేదు.. కిషన్​రెడ్డి సంచలన వ్యాఖ్యలు

BJP Dharna | రాష్ట్రంలో పాలన మారినా దోపిడీ ఆగలేదు.. కిషన్​రెడ్డి సంచలన వ్యాఖ్యలు

by tinnu
0 comments
BJP Dharna

అక్షరటుడే, వెబ్​డెస్క్: BJP Dharna | రాష్ట్రంలో బీఆర్​ఎస్​ పాలన పోయి కాంగ్రెస్​ వచ్చినా దోపిడీ మాత్రం ఆగలేదని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి (Union Minister Kishan Reddy) అన్నారు. కాంగ్రెస్​ హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్​ హామీలు అమలు చేయాలని డిమాండ్​ చేస్తూ హైదరాబాద్​లోని ఇందిరాపార్క్​ ధర్నా చౌక్​ (Indira Park Dharna Chowk) వద్ద బీజేపీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. కిషన్​రెడ్డి మాట్లాడుతూన.. బీఆర్​ఎస్​ పదేళ్ల పాలనలో రాష్ట్రం అప్పుల పాలైందన్నారు. కేసీఆర్​ కుటుంబ, నియంత పాలనతో విసిగి పోయిన ప్రజలు కాంగ్రెస్​ హామీలను నమ్మి గెలిపించారన్నారు. ఆ పార్టీ ఎన్ని హామీలు అమలు చేసిందని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా.. ఇంకా రెండు లక్షల ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయలేదన్నారు. ప్రభుత్వ భూములు అమ్మకపోతే పథకాలు అమలు చేయలేని పరిస్థితి ఉందని విమర్శించారు.

BJP Dharna | నట్టేట ముంచింది.

తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ నట్టేట ముంచిందని ఎంపీ లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వంచించడమే కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీ అన్నారు. గతంలో హైడ్రా, మూసీ పేరుతో ప్రజల దృష్టి మళ్లించారని విమర్శించారు. ఇప్పుడు రైజింగ్‌ తెలంగాణతో దృష్టి మళ్లిస్తున్నారన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్​రావు (BJP state president Ramachandra Ra) మాట్లాడుతూ.. రెండేళ్ల కాంగ్రెస్​ పాలనతో రైతు, మహిళ, యువత, విద్యార్థి.. ప్రతి వర్గానికీ అన్యాయం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను చార్జ్‌షీట్‌ రూపంలో విడుదల చేశారు.

వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ (Revanth Reddy government) రెండేళ్లు గడిచినా ప్రజలను మోసం చేసిందని రాంచందర్​రావు మండిపడ్డారు. రైతులను రుణమాఫీ, రైతు భరోసా రూపంలో మోసం చేశారని, ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువత నిరుద్యోగంలోనే మగ్గి పోతోందని, టీఎస్పీఎస్సీ వంటి సంస్థల్లో పారదర్శకత లేదని . మహిళలకు ఇస్తామన్న రూ. 2,500 మహాలక్ష్మి పథకం, వృద్ధులకు పెంచాల్సిన రూ. 4,000 పెన్షన్లు, పేదలకు కట్టిస్తామన్న ఇందిరమ్మ ఇళ్లు వంటి హామీలన్నీ గాలిలో దీపాలుగా మారాయని ధ్వజమెత్తారు.

You may also like