అక్షరటుడే, వెబ్‌డెస్క్: Greenland | అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై (US President Donald Trump) ఐరోపా దేశాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. గ్రీన్‌ల్యాండ్ (Greenland) విషయంలో అగ్రరాజ్యం తీరును ఖండించాయి.
గ్రీన్‌ల్యాండ్‌ను స్వాధీనం చేసుకోవడానికి అమెరికా యత్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే అగ్రరాజ్యం చర్యలకు ఈయూ దేశాలు వ్యతిరేకించాయి. ప్రస్తుతం గ్రీన్‌ల్యాండ్ డెన్మార్క్ (Denmark) ఆధీనంలో ఉంది. దీంతో నాటో దేశాల భద్రతలో భాగంగా ఐరోపా దేశాలు అక్కడ సైన్యాన్ని మోహరించాయి. దీంతో తమ విధానాన్ని వ్యతిరేకిస్తున్న 8 ఐరోపా దేశాలపై ట్రంప్ సుంకాల మోత మోగించారు. పది శాతం సుంకాలు వేశారు. అయితే దీన్ని ఐరోపా దేశాలు ఖండించాయి.
Greenland | తప్పుడు చర్య
ట్రంప్ నిర్ణయాన్ని తప్పుడు చర్యగా బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ పేర్కొన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మెక్రాన్ సైతం అమెరికా నిర్ణయం ఆమోదయోగ్యం కాదన్నారు. మరోవైపు.. అమెరికా తీరును నిరసిస్తూ గ్రీన్‌లాండ్, డెన్మార్క్‌లలో వేలాది మంది నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అమెరికా నిర్ణయం చైనా, రష్యాకు మేలు చేసేలా ఉందని ఈయూ ఫారిన్ పాలసీ చీఫ్ కాజా కల్లాస్ తెలిపారు. అగ్రరాజ్యం తమను బెదిరించలేదని స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టర్సన్ స్పష్టం చేశారు.