Exato Technologies IPO | ఆకర్షిస్తోన్న ఐపీవో.. అలాట్‌ అయితే కాసుల పంటే!

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Exato Technologies IPO | బీఎస్‌ఈ ఎస్‌ఎంఈ(BSE SME) కంపెనీ అయిన ఎక్సాటో టెక్నాలజిస్‌ లిమిటెడ్‌ (Exato Technologies Ltd) ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోంది. దీని జీఎంపీ 90 శాతం ఉండడంతో ఐపీవో అలాట్‌ అయితే తొలిరోజే సంపద డబుల్‌ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో భారీగా ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎక్సాటో టెక్నాలజీస్‌ లిమిటెడ్‌ బ్యాంకింగ్‌, ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌ అండ్‌ ఇన్సూరెన్సు, హెల్త్‌ కేర్‌, రిటైల్‌, టెలికాం, మాన్యూఫాక్చరింగ్‌్‌, ఐటీ […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Exato Technologies IPO | బీఎస్‌ఈ ఎస్‌ఎంఈ(BSE SME) కంపెనీ అయిన ఎక్సాటో టెక్నాలజిస్‌ లిమిటెడ్‌ (Exato Technologies Ltd) ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోంది.

దీని జీఎంపీ 90 శాతం ఉండడంతో ఐపీవో అలాట్‌ అయితే తొలిరోజే సంపద డబుల్‌ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో భారీగా ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఎక్సాటో టెక్నాలజీస్‌ లిమిటెడ్‌ బ్యాంకింగ్‌, ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌ అండ్‌ ఇన్సూరెన్సు, హెల్త్‌ కేర్‌, రిటైల్‌, టెలికాం, మాన్యూఫాక్చరింగ్‌్‌, ఐటీ వంటి కీలక సెక్టార్స్‌ కోసం సీఎక్స్‌ అండ్‌ అనలిటిక్స్‌, యూనిఫైడ్‌ కమ్యూనికేషన్స్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఎక్సాటో ఐక్యూ వంటి విస్తృత శ్రేణి సర్వీసులను అందిస్తోంది.

ఈ కంపెనీ ఐపీవో (IPO) ద్వారా రూ. 37.45 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఇందులో ఫ్రెష్‌ ఇష్యూ ద్వారా రూ. 31.85 కోట్లు, ఆఫర్‌ ఫర్‌ సేల్‌(Offer For Sale) ద్వారా రూ. 5.6 కోట్లు సమీకరించనుంది.

ఐపీవో ద్వారా వచ్చిన ఆదాయాన్ని క్యాపిటల్‌ ఎక్స్పెండిచర్‌ అవసరాల కోసం, ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్‌లో పెట్టుబడి పెట్టడానికి, కంపెనీకి ఉన్న రుణాలను చెల్లించడం కోసం, సాధారణ కార్పొరేట్‌ అవసరాల కోసం వినియోగించనున్నట్లు కంపెనీ తెలిపింది.

ప్రైస్‌ బ్యాండ్‌..

ప్రైస్‌ బ్యాండ్‌ను ఒక్కో ఈక్విటీ షేరుకు రూ. 133 నుంచి రూ. 140 గా కంపెనీ నిర్ణయించింది. లాట్‌(Lot)లో వెయ్యి షేర్లున్నాయి. రిటైల్‌ ఇన్వెస్టర్లు కనీసం రెండు లాట్ల కోసం కోసం గరిష్ట ప్రైస్‌ బ్యాండ్‌ వద్ద రూ. 2.80 లక్షలతో బిడ్‌ వేయాల్సి ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు..

ఐపీవో సబ్‌స్క్రిప్షన్‌(Subscription) నవంబర్‌ 28 ప్రారంభమైంది. డిసెంబర్‌ 2 వరకు అందుబాటులో ఉండనుంది. మూడో తేదీన అలాట్‌మెంట్‌ స్టేటస్‌ వెల్లడవనుంది. కంపెనీ షేర్లు డిసెంబర్‌ 5 న బీఎస్‌ఈలో లిస్టవుతాయి.

కోటా, జీఎంపీ..

ఈ ఐపీవోలో రిటైల్‌ ఇన్వెస్టర్ల(Retail Investors)కు 33.27 శాతం, ఎన్‌ఐఐలకు 14.28 శాతం, మార్కెట్‌ మేకర్‌కు 5.01 శాతం, క్యూఐబీలకు 47.44 శాతం వాటాను కేటాయించారు. కంపెనీ షేర్లకు గ్రే మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది.

ఆదివారం ఒక్కో ఈక్విటీ షేరుపై రూ. 128 ప్రీమియం ఉంది. అంటే ఈ ఐపీవో అలాట్‌ అయినవారికి లిస్టింగ్‌ సమయంలో 90 శాతానికిపైగా లిస్టింగ్‌ గెయిన్స్‌(Listing gaines) వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...