- Advertisement -
Homeజిల్లాలునిజామాబాద్​Eravathri Anil | జిల్లా కాంగ్రెస్​ కార్యాలయంలో ఈరవత్రి అనిల్​ జన్మదిన వేడుక

Eravathri Anil | జిల్లా కాంగ్రెస్​ కార్యాలయంలో ఈరవత్రి అనిల్​ జన్మదిన వేడుక

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Eravathri Anil | రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఛైర్మన్ ఈరవత్రి అనిల్ జన్మదిన వేడుకలను నగరంలోని కాంగ్రెస్​ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. ఎన్​ఎస్​యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణు రాజ్ ఆధ్వర్యంలో శుక్రవారం కేక్​ చేసి సంబరాలు జరిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈరవత్రి అనిల్ (Eravathri Anil) జన్మదిన వేడుకలను కాంగ్రెస్​ భవన్​లో ​(Congress Bhavan) నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అనిల్ ఎల్లప్పుడు బడుగు బలహీన ప్రజల కోసం కృషి చేశారన్నారు. ఎల్లవేళలా కార్యకర్తలు, ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సేవ చేసిన నాయకుడని ఆయనను కొనియాడారు. ఈరవత్రి అనిల్ మరిన్ని ఉన్నత స్థానాలకు ఎదగాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎన్ఎస్​యూఐ జిల్లా ప్రధాన కార్యదర్శి సాయికిరణ్, శివ, హరీష్, అభిలాష్, గణేష్, పండు, ధనుష్​, తేజ, రవి,రాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News