EPFO | ఈపీఎఫ్​ చందాదారులకు శుభవార్త.. రూ.5 లక్షలకు పెరుగనున్న ఆటో సెటిల్మెంట్ పరిమితి

అక్షరటుడే, వెబ్​డెస్క్​: EPFO | ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) చందాదారులకు త్వరలోనే శుభవార్త రానుంది. ఈపీఎఫ్​వో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్(సీబీటీ) వచ్చే నెల నుంచి అడ్వాన్స్ క్లెయిమ్స్​(అసాక్) ఆటో-సెటిల్మెంట్(Auto-settlement) పరిమితిని ప్రస్తుతమున్న రూ. లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచనుంది. ఇది మాన్యువల్ వెరిఫికేషన్(Manual Verification) అవసరం లేకుండానే మొత్తాన్ని ఉపసంహరించుకోవడానికి వీలు కల్పిస్తుంది. సీబీటీ(CBT) మేలో జరిగే సమావేశంలో ఈపీఎఫ్​వో చందాదారులకు గణనీయమైన ఉపశమనం కల్పిస్తూ ఆమోదం మంజూరు చేస్తుందని సంబంధిత అధికారి […]

అక్షరటుడే, వెబ్​డెస్క్​: EPFO | ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) చందాదారులకు త్వరలోనే శుభవార్త రానుంది. ఈపీఎఫ్​వో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్(సీబీటీ) వచ్చే నెల నుంచి అడ్వాన్స్ క్లెయిమ్స్​(అసాక్) ఆటో-సెటిల్మెంట్(Auto-settlement) పరిమితిని ప్రస్తుతమున్న రూ. లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచనుంది. ఇది మాన్యువల్ వెరిఫికేషన్(Manual Verification) అవసరం లేకుండానే మొత్తాన్ని ఉపసంహరించుకోవడానికి వీలు కల్పిస్తుంది. సీబీటీ(CBT) మేలో జరిగే సమావేశంలో ఈపీఎఫ్​వో చందాదారులకు గణనీయమైన ఉపశమనం కల్పిస్తూ ఆమోదం మంజూరు చేస్తుందని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. ఈపీఎఫ్​వోలో ప్రస్తుతం దాదాపు 7.4 కోట్ల యాక్టివ్ సబ్​స్క్రైబర్లు ఉన్నారు.

EPFO | గతంలో రూ.50 వేలే..

గతంలో అడ్వాన్స్ క్లెయిమ్​ల(Advance claims) పరిమితి రూ.50 వేలు మాత్రమే ఉండేది. ఈ పరిమితిని మే 2024లో నుంచి రూ. లక్షకు పెంచారు. దీని ఫలితంగా ఈపీఎఫ్​వో(EPFO) సభ్యులకు జీవన సౌలభ్యం మెరుగుపడిందని అధికారులు తెలిపారు. ఆటో-సెటిల్మెంట్(Auto-settlement) క్లెయిమ్​లు అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో దాదాపు 9 మిలియన్లు ఉండగా, గత ఆర్థిక సంవత్సరం దాదాపు 20 మిలియన్లకు పెరిగాయి. గత మార్చిలో జరిగిన సీబీటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ అసాక్ పరిమితిని రూ. 5 లక్షలకు పెంచే ప్రతిపాదనను ఆమోదించింది.

EPFO | ఏటీఎంల ద్వారా విత్​డ్రాకు అవకాశం..

ఈపీఎఫ్​వో తన చందాదారులకు అనేక వసతులు అందుబాటులోకి తీసుకొస్తోంది. జూన్ నుంచి ఏటీఎంలు, యూపీఐ ద్వారా ఈపీఎఫ్​వో క్లెయిమ్​ల ఉపసంహరణకు సీబీటీ ఆమోదం తెలిపనుందని సంబంధిత అధికారి తెలిపారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) యూపీఐ ప్లాట్​ఫాంల(UPI platforms) ద్వారా ఆటో-క్లెయిమ్(Advance claim) సెటిల్మెంట్​ను అనుమతించడానికి ఫ్రేమ్​ వర్క్​ రూపొందించిందని వెల్లడించారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...