అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: CP Sai Chaitanya | రాబోయే ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు పోలీస్ అధికారులంతా బాధ్యతగా పనిచేయాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (CP Sai Chaitanya) సూచించారు. నిజామాబాద్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల అధికారులతో నెలవారి సమీక్ష సమావేశాన్ని మంగళవారం నిజామాబాద్ పోలీస్ కార్యాలయంలో (Nizamabad Police office) నిర్వహించారు.
CP Sai Chaitanya | బాధ్యతగా పనిచేయాలి..
రాబోయే కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికలను (municipal elections) ప్రశాంత వాతావరణంలో జరిగేలా అధికారులందరూ బాధ్యతగా తమ విధులు నిర్వర్తించాలని సీపీ సూచించారు. ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పటిష్టమైన చర్యలు చేపట్టాలని కోరారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై ఉక్కుపాదం మోపాలని ఆదేశాలు జారీచేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు ర్యాలీలు, సభలకు అనుమతి తీసుకోవడం తప్పనిసరని అని సూచించారు. ఎవరైనా ఉల్లంఘిస్తే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
CP Sai Chaitanya | పెండింగ్ కేసులపై..
పెండింగ్లో ఉన్న కేసులలో గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల గురించి సీపీ వివరాలు తెలుసుకున్నారు. గ్రేవ్, నాన్గ్రేవ్ కేసుల్లో ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. కేసు నమోదు నుంచి ఛార్జీషీట్ వరకు ప్రతి విషయాన్ని కూలంకశంగా పరిశోధన చేసి ఫైనల్ చేయాలని తెలిపారు. పోక్సో, గ్రేవ్ కేసుల్లో (POCSO and grave cases) త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తిచేసి కోర్టులో ఛార్జీషీట్ దాఖలు చేయాలన్నారు.
CP Sai Chaitanya | దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న కేసులు..
దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించి వెంటనే పరిష్కరించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని సీపీ అన్నారు. పెండింగ్ కేసుల విషయంలో నిరంతర పర్యవేక్షణ ఉంటుందని, కొత్త కేసులతో పాటు చాలా కాలంగా ఉన్న పెండింగ్ కేసులను ఎప్పటికప్పుడు సమీక్షించే విధంగా అధికారులు పనిచేయాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సమర్ధవంతమైన సేవలు అందజేస్తూ సత్వరన్యాయం చేసేలా కృషి చేయాలని పేర్కొన్నారు.
గ్రామ పోలీస్ అధికారులు ప్రతిరోజు గ్రామాన్ని సందర్శించి ప్రజలతో మమేకమవుతూ.. నేర నియంత్రణకు కృషి చేయాలని సూచించారు. కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా గ్రామాలలో సీసీ కెమెరాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తూ కృషి చేయాలన్నారు.
CP Sai Chaitanya | సైబర్ క్రైం, డయన్ యువర్ 100పై..
సైబర్ క్రైం , డయల్ 100 సర్వీసుల వినియోగంపై విద్యార్థులకు ప్రజలకు అవగాహన కల్పించాలని సీపీ తెలిపారు. ఆన్లైన్ మోసాలకు గురైనట్లయితే 1930 కాల్ చేసి లేదా ఎన్సీఆర్సీలో ఫిర్యాదు చేయాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అరైవ్ అలైవ్ (Arrive Alive) కార్యక్రమంలో భాగంగా పెద్దఎత్తున ప్రజల్లో అవగాహన కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. క్రమం తప్పకుండా నేరాలకు పాల్పడుతున్న వారిపై పీడీ యాక్ట్ కోసం వివరాలు పంపాలన్నారు. సమీక్షలో అదనపు డీసీపీ (అడ్మిన్) బస్వారెడ్డి, నిజామాబాద్ ఏసీపీ రాజ వెంకట్ రెడ్డి, సైబర్ క్రైం ఏసీపీ వెంకటేశ్వర్రావు, సీసీఆర్బీ ఇన్స్పెక్టర్ అంజయ్య, నిజామాబాద్ డివిజన్ సీఐలు, ఎస్సైలు, ఐటీ కోర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.